వినతిపత్రం అందించిన ఏపీ ఎమ్ పీఏ నాయకులు
విజయవాడ : అక్రిడిటేషన్ లో నిబంధనలు సరళతరం చేసి,జిల్లా సమాచార శాఖ అధికారులు
తక్షణమే అక్రిడిటే షన్ ప్రక్రియ పూర్తి చేసే విధంగా తగు అదేశాలివ్వాలని ఏ.
పి.ఎం.పి.ఏ నాయకులు సమాచార శాఖ అధికారులను ఏ. పి.ఎం.పి.ఏ. నాయకులు
కోరారు.అదేవిధంగా గత ప్రభుత్వాల హయాంలో ఉన్న జర్నలిస్ట్ సంక్షేమ పథకాలను
పునరుద్ధరణ చేయాలని ఏ పి ఎమ్ పి ఏ రాష్ట్ర కార్యదర్శి యేమినేని వెంకట రమణ
పర్యవేక్షణ లో రాష్ట్ర సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ స్వర్ణలత, జాయింట్
డైరెక్టర్ టి కస్తూరి లకు నాయకులు వినతి పత్రాలు మంగళవారం సాయంత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ మీడియా ఫ్రొఫిషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర
అధ్యక్షులు వీర్ల శ్రీరామ్ యాదవ్,విజయవాడ నగర అధ్యక్షులు టి అనిల్ కుమార్,
ప్రధాన కార్యదర్శి గుర్రం శ్రీనివాసరావు , ఏ. పి.ఎం.పి.ఏ. నాయకులు
కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.