రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి వై.శ్రీలక్ష్మి వెల్లడి
విజయవాడ : క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా ఇంటింటి చెత్త సేకరణ కోసం
ఈ-ఆటోలను రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఉదయం ప్రారంభించనున్నట్లు రాష్ట్ర
పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి వై.శ్రీలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో
తెలిపారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్లో కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఇంటింటి
చెత్తను తడి, పొడిగా వేరుగా సేకరణ చేయడానికి 516 ఈ-ఆటోలను ప్రభుత్వం
అందించిందని, ఈ-ఆటోలను ముఖ్యమంత్రి గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని
క్యాంప్ కార్యాలయం వద్ద ప్రారంభిస్తారని తెలిపారు. శుక్రవారం నుండి ఆయా
నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీల వార్డ్ సచివాలయాల వారిగా ఈ-ఆటోలు అందుబాటులోకి
వస్తాయని, తద్వారా మెరుగైన ఇంటింటి చెత్త సేకరణ నూరు శాతం చేయడానికి అవకాశం
కలుగుతుందన్నారు. ఇప్పటికే ప్రజారోగ్య కార్మికులకు దశల వారిగా ఆటోల డ్రైవింగ్
శిక్షణ ఇచ్చామన్నారు. ఈ-ఆటోల ప్రారంభోత్సవ కార్యక్రమ నిర్వహణకు స్వచ్చంధ్ర
కార్పోరేషన్ ఎండి, సిడిఎంఏ, జిల్లా కలెక్టర్, విజయవాడ కమిషనర్ స్వప్నిల్
దినకర్ పుండ్కర్, మంగళగిరి-తాడేపల్లి కమిషనర్లకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు
జారీ చేసినట్లు తెలిపారు.