సానుకూలంగా స్పందించిన కమిషనర్
విజయవాడ:
జిల్లాల పరిధిలోని అక్రిడిటేషన్ల జారీ విషయంలో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం
జరుగుతుందని రాష్ట్ర సమాచార కమిషనర్ విజయకుమార్ రెడ్డికి ఏపీయూడబ్ల్యూజే
ప్రతినిధి వర్గం తెలిపింది. ఆ మేరకు మంగళవారం రాష్ట్ర సమాచార కమిషనర్ విజయ్
కుమార్ రెడ్డిని ఏపీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందం కలిసి సమస్యలను వివరించింది.
జిల్లాల కలెక్టర్లు వాస్తవికతను గుర్తించకుండా జీవో పేరుతో ఎక్కువ మంది
జర్నలిస్టుల దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని వివరించారు. అనేక చోట్ల సమాచార
శాఖ జిల్లా అధికారులు కలెక్టర్లను తప్పుదారి పట్టిస్తున్నారని కమిషన్ ర్ కు
తెలిపారు. జిల్లాల వారీ సమస్యలు వివరించిన అనంతరం సమస్యల పరిష్కారంపై సమాచార
శాఖ కమిషనర్ సానుకూలంగా స్పందించారు. ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి
ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ వి సుబ్బారావు రాష్ట్ర
వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి
తీసుకువచ్చారు. చిన్న పత్రికలకు సంబంధించి ఐటీ రిటర్న్స్ నిబంధనలను సడలించాలని
నాయకులు కమిషనర్ దృష్టికి తీసుకురాగా దానికి బదులుగా తమ పత్రిక ఆదాయపన్ను
పరిధిలోకి రాదనే విషయాన్ని సెల్ఫ్ డెక్లరేషన్ ద్వారా తెలియజేస్తే
సరిపోతుందని కమిషనర్ తెలిపారు. మండలాల్లో ఫ్రీలాన్స్ జర్నలిస్టుల అక్రిడేషన్
మంజూరుకు పది సంవత్సరాల అనుభవంవుండాలన్న నిబంధన ప్రతిబంధకంగా మారిన విషయం ను
నాయకులు వివరించారు. అయితే సదరు జర్నలిస్ట్ పది సంవత్సరాల అనుభవాన్ని
వివరిస్తూ సెల్ఫ్ డెక్లరేషన్ ఇస్తే సరిపోతుందని కమిషన్ ర్ తెలిపారు. ఆ
మేరకు జిల్లాలలోని సమాచార శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని జాయింట్ డైరెక్టర్
కస్తూరి ని ఆదేశించారు. జిల్లాలలో డెస్క్ లలో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లకు పాత
పద్ధతినే అక్రిడేషన్ మంజూరు చేయాలని, అందుకోసం పత్రికల పేజీలు నిబంధనలను
సడలించాలని కమిషనర్ ను నాయకులు కోరారు . ఈ విషయం పై సమీక్ష అనంతరం ఆయా
పత్రికలు ఎన్ని పేజీలు తో వస్తుంది మరోసారి చూసి అవసరమైన మార్పులు చేయాలని
అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రాలలో చిన్న పత్రికలకు వన్ ప్లస్ వన్
అక్రిడిటేషన్లు మంజూరు చేయాలని అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు
టూ ప్లస్ టు ఇవ్వాలని కోరారు ఈ విషయంపై మరోసారి పరిశీలిస్తానని కమిషనర్ హామీ
ఇచ్చారు. కమిషనర్ ను కలిసిన ప్రతినిధి బృందంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
కే జయరాజ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఏచూరి శివ, కృష్ణా అర్బన్ యూనిట్
కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు షేక్ బాబు, యూనియన్
రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, సీహెచ్
రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.