సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద 7మంది లబ్ధి దారులకు 5 లక్షల 57వేల రూపాయల చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డినంద్యాల : పేద, బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య భరోసాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకంలో 3వేల వ్యాధులకు ఉచితంగా వైద్య చికిత్సలకు అనుమతులు ఇచ్చారు. అయితే ఆరోగ్యశ్రీ క్రింద రాని వ్యాధులకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద ఆర్థిక సాయాన్ని అందిస్తూ ఆరోగ్య భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. నంద్యాల నియోజకవర్గలో బుధవారం 7మంది లబ్ది దారులకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద మంజూరైన 5లక్షల 57 వేల రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్ రెడ్డి బుధవారం అందించారు. నంద్యాల నియోజకవర్గంలోని లబ్ధిదారుల తరపున సీఎం జగన్మోహన్ రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నంద్యాల నియోజకవర్గం పరిధిలో నేటికి ఎల్టీసీలతో కలిపి 4కోట్ల 92లక్షల 55 వేల రూపాయల ఆర్థిక సాయం సంబంధిత లబ్ధి దారులు పొందడం జరిగిందన్నారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి లబ్ధి దారుల తరపున ప్రత్యేక ధన్యవాదలు తెలిపారు. ఆరోగ్యశ్రీ క్రింద రాని వ్యాధులకు కూడా ఏదోవిధంగా ఆర్థికసాయాన్ని అందించే లక్ష్యంతో సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద ఆర్థిక సాయం అందిస్తూ చికిత్స అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్ పాంషావలి, వైసీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.