లక్ష లోపు జనాభా ఉన్న 55 మున్సిపాలిటీలలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల
ఏర్పాటు
2,62,000 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి లక్ష్యంగా పనులు
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
అమరావతి : ఈ-ఆటోలతో మున్సిపాలిటీలపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆంధ్రప్రదేశ్
పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాష్ట్రాన్ని క్లీన్
ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న లక్ష్యంతో చిన్న మున్సిపాలిటీల్లోనూ చెత్త సేకరణకు
పర్యావరణహితంగా ఉండే విద్యుత్తు ఆటోలను (ఈ–ఆటోలను) ప్రవేశపెట్టారు. గురువారం
తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి జెండా ఊపి వీటిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి
మాట్లాడుతూ ‘‘ఐదు క్వింటాళ్ల సామర్థ్యం కలిగిన వాహనాలను కొనుగోలు చేశాం.
వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులను చేపట్టాం. కోటి 20 లక్షల డస్ట్బిన్లను
అందించాం. తడి, పొడి చెత్త సేకరణకు ప్రత్యేక ఏర్పాటు చేశాం. మురుగు నీటిని
శుద్ది చేసే ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో చెత్త రహిత
రాష్ట్రం సాకారం అవుతుంది. మున్సిపాలిటీల్లో కాంట్రాక్టర్లకు బిల్లులు
చెల్లింపు చేశాం. కానీ ఎల్లో మీడియాలో విష ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం
గుడివాడలో టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తున్నాం. పేదలకు ఇళ్లు ఉండాలనేది సీఎం
జగన్ లక్ష్యం’’ అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు.
చిన్న మున్సిపాలిటీలకు ఆర్థిక భారం తగ్గించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఈ-ఆటోలను ప్రారంభించారని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. గురువారం ఉదయం
క్లాప్ కార్యక్రమంలో భాగంగా ఈ-ఆటోలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ
సందర్భంగా సురేష్ మాట్లాడుతూ పరిపాలన వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీరకణలో
భాగంగా సీఎం జగన్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. 36 మున్సిపాలిటీలకు
516 ఈ- ఆటోలను పంపిణీ చేశామన్నారు. రెండవ విడత మరిన్ని ఈ ఆటోలు పంపిణీ
చేస్తామని చెప్పారు. ఇప్పటికే 123 మున్సిపాలిటీలోని 40 లక్షల కుటుంబాలకు తడి,
పొడి, హానికర వ్యర్ధాల సేకరణకు నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో 120 లక్షల
చెత్తబుట్టలను పంపిణీ చేశామన్నారు. గ్రేడ్-1 ఆపై మున్సిపాలిటీల్లో చెత్త
సేకరణకు 2,525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ గార్భేజ్ టిప్పర్ల వినియోగం
జరుగుతోందన్నారు. ఇప్పటికే గుంటూరు, విశాఖపట్నంలలో వెస్ట్ టూ ఎనర్జీ
ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని మంత్రి చెప్పారు.
త్వరలో రోజుకు 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో మరో ప్లాంట్ ఏర్పాటు
చేస్తామన్నారు. ప్రభుత్వం 71 సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ ప్రాజెక్టులు, తడి
చెత్త నిర్వహణకు 29 వేస్ట్ టూ కంపోస్ట్, 4 బయో మిధనేషన్ ప్రాజెక్ట్ను ఏర్పాటు
చేసిందని తెలిపారు. లక్ష లోపు జనాభా ఉన్న 66 మున్సిపాలిటీల్లో రూ.1,445
కోట్లతో 206 ఎస్టీపీలను ఏర్పాటు చేశామన్నారు. లక్ష లోపు జనాభా ఉన్న 55
మున్సిపాలిటీలలో ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేశామని
అన్నారు. మున్సిపాలిటీల్లో పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేశామని, ఈ- ఆటోల
డ్రైవర్లుగా 80 నుంచి 100 మంది మహిళలకు అవకాశం ఇస్తున్నామన్నారు. ఎంఐజీ,
టిడ్కో లే అవుట్లు త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. నాణ్యత
ప్రమాణాల్లో రాజీ పడకుండా పనులు పూర్తి చేస్తామన్నారు. గుడివాడలో సీఎం జగన్
అన్ని సౌకర్యాలతో టిడ్కో ఇళ్లు ప్రారంభించనున్నారన్నారు. గతంలోనే అన్ని
సౌకర్యాలు చంద్రబాబు కల్పించి ఉంటే లబ్దిదారులు టిడ్కో ఇళ్లలో ఇప్పటికే
చేరేవారన్నారు. 2,62,000 లక్షల టిడ్కో ఇళ్ల పూర్తి లక్ష్యంగా పనులు
చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.