నెల్లూరు : గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ పై
ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ మెరుగైన
వైద్య సేవలు అందించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్,
ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తిక్కన
ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల
వైద్యులతో సమావేశమై ప్రజలకు అందిస్తున్న వివిధ రకాల వైద్య సేవల పై
సమీక్షించారు. ఈ సమీక్ష లో గర్భిణీల, బాలింతల, కిషోర బాలలకు హీమోగ్లోబిన్
పరీక్షలు, ఎన్ సి డి సి డి సర్వే, ఆరోగ్య శ్రీ, సుస్థిర అభివృద్ధి సూచీలు,
సీజనల్ వ్యాధులు, అందిస్తున్న వైద్య సేవలు తదితర అంశాల పై పి.హెచ్.సి
వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం
ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ పై ప్రజల్లో
అవగాహన కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్య పరిస్థితులను తెలుసుకుంటూ మెరుగైన
వైద్య సేవలు అందించేలా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా మాతా శిశు మరణాలను
తగ్గించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమని, దానికనుగుణంగా
గర్భిణీలకు, బాలింతలకు రెగ్యులర్ గా రక్త పరీక్షలు జరిపి అనీమియా రాకుండా
తగు వైద్యం అందించాలని సూచించారు. అదే విధంగా పాఠశాలలను తనిఖీ చేసి కిషోర
బాలలలో రక్త హీనత లేకుండా చూడాలన్నారు. రక్త హీనత తో బాధ పడేవారు రెగ్యులర్
గా మాత్రలు వేసుకునేలా ఆశ కార్యకర్తల ద్వారా మానిటర్ చేయాలన్నారు.
ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ కింద వైద్య పరీక్షలు కొరకు వచ్చిన ప్రతి
ఒక్కరికి బి.పి, షుగర్, టి.బి వంటి వ్యాధులు గుర్తించి వారి వివరాలను సంబందిత
యాప్ లలో అప్లోడ్ చేయాలని అన్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది
క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే ప్రజలకు ఆరోగ్యపరంగా మెరుగైన సేవలు
అందించడం సులువవుతుందన్నారు. ముఖ్యంగా ఎస్.సి., ఎస్.టి కాలనీల్లో ప్రత్యేక
దృష్టి సారించాల్సిన అవసరం వుందన్నారు. బాలింతలకు రిజిస్ట్రేషన్ దశ నుండి
చెకప్, డెలివరీ అయి వారు ఇంటికి చేరే వరకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల
సేవలు కచ్చితంగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
అదేవిధంగా టీబీ తో బాధపడుతున్న రోగుల ఇళ్లను సందర్శించి సరైన మందులు
వాడుతున్నది లేనిదీ గమనిస్తూ సరైన పోషకాహారం అందుతున్న వైనం
తెలుసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి బరువు తక్కువగా, ఎత్తు
తక్కువగా ఉండే పిల్లలకు తగు సూచనలు చేయాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రం పరిధిలో
ఇమ్మ్యునైజేషన్ నూటికి నూరు శాతం అమలు జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్
ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంచార్జీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకట
ప్రసాద్, జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు.