పార్వతీపురం : రహదారుల నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా
కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాచిపెంట
మండలంలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో నిర్మిస్తున్న రహదారులను పూర్తి
స్థాయిలో పరిశీలించేందుకు విస్తృతంగా పర్యటించారు. ప్రధాన మంత్రి గ్రామ సడక్
యోజన లో భాగంగా మండలంలోని కుంటాం నుండి తుమ్మిగుడ్డి వరకు వయా మెట్ట గుడ్డి
మీదుగా అంచనా విలువ రూ.465 లక్షల వ్యయంతో సుమారు 6.9 కి.మీ , వేటగాని వలస
గ్రామం నుండి శతాబి మీదుగా అరకు రోడ్ కూడలి వరకు అంచనా విలువ రూ.997 లక్షల
వ్యయంతో సుమారు 14 కి.మీ. మేరకు అర్ పి పి ఎల్ డబ్ల్యూ వి క్రింద
నిర్మిస్తున్న తారు రోడ్డు పనులను పరిశీలించారు. రోడ్ నిర్మాణ పనుల వివరాలను
ఇంజనీరింగ్ అధికారులను అడిగితెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కొంటాం నుండి తుమ్మి గుడ్డి, వేటగానివలస రహదారుల నిర్మాణాలకు అవసరమైన అటవీ
అనుమతులు లభించినందున నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
కల్వర్టు నిర్మాణాలకు అనుకూలం మైనందున పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు
చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారి డా.ఎమ్.వి.ఆర్ కృష్ణాజీ ని
ఆదేశించారు. నాణ్యత ప్రమాణాలు పాటించి వీలైనంత త్వరగా ప్రజల రాకపోకలకు, రవాణా
సౌకర్యాలు కలిగే విధంగా పూర్తిస్థాయిలో రహదారులను వినియోగంలోకి తీసుకురావాలని
సూచించారు. అనంతరం మండలంలోని బడ్నాయక్ వలస మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నాడు
నేడు క్రింద చేపడుతున్న మరత్తుల పనులను పరిశీలించారు. పాటశాల తరగతి గదుల
ఫ్లోరింగ్ పనులు , అదనపు తరగతి గది నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను
ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి ఎన్. ప్రేమ్ కుమార్,
తసీల్దార్ ఎమ్.రాజ శేఖర్, పంచాయితీ రాజ్ శాఖ డీ ఈ డబ్ల్యూ. వి.శర్మ, ఏ ఈ
బి.శంకర్ రావు, రెవెన్యూ ఇన్స్పక్టర్ డి.రమణ రావు, తదితరులు, పాల్గొన్నారు.