నర్సంపేట : వరంగల్ జిల్లా, నర్సంపేట మండల కేంద్రంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది
ఉత్సవాల్లో నిర్వహించిన సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన,
స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అంతకు ముందు. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం, నాగారం గ్రామంలో శ్రీ మంజునాథ
స్వామి, శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో
నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు
చేశారు. అనంతరం కోటి 20 లక్షల అంచనా విలువతో పి.ఆర్ రోడ్డు నాగారం నుండి పాత
తండా వరకు బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 78.00 లక్షల అంచనా
విలువతో నాగారం నుండి భవాని గడ్డ తండా వరకు బి.టి రోడ్డు నిర్మాణ పనులకు
శంకుస్థాపన చేశారు. 2 కోట్ల 14 లక్షల అంచనా విలువతో టి.డబ్ల్యూ రోడ్డు నుండి
నక్కలగుట్ట తండా వరకు బి.టి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వరంగల్
జిల్లా నెక్కొండ మండలం నాగారంలో 1 కోటి 20 లక్షల రూపాయలతో అంతర్గత సిసి రోడ్ల
నిర్మాణ పనుల కోసం శంకుస్థాపన చేశారు. అనంతరం చేన్నరావుపేటలో తెలంగాణ తల్లి
నూతన విగ్రహావిష్కరించి, పూలమాలవి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో
లబ్ధిదారులకు పలు యూనిట్ లను మంత్రి చేతుల మీదగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ కులవృత్తుల
సామాజిక, ఆర్థిక అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం. పేద, చేతి
వృత్తిదారులను గుర్తించి ఆర్థిక చేయూతనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి
చేస్తుంది. సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శం. ఆసరా పెన్షన్లు,
సంక్షేమ పథకాలకు 5లక్షల కోట్లు,
తొమ్మిదేళ్ళలో పెన్షన్లకే రూ.58,696 కోట్లు ఖర్చు చేసిన ఘనత ముఖ్యమంత్రి
కేసీఆర్ కే దక్కుతుంది. కెసిఆర్ నాయకత్వంలో ప్రతి ఏడాది బీసీ, ఎస్సీ ,ఎస్టీ
మైనారిటీ సంక్షేమాలకొసం 50వేల కోట్లను ఖర్చు చేస్తుంది. సబ్బండ వర్గాలకు, ఆసరా
అవసరమైన సకల జనులకు కనీస జీవన భద్రత కల్పించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం
కార్యరూపం దల్చింది. గిరిజన బిడ్డలు ఉన్న నర్సంపేట ప్రాంతంలో 63 కోట్లతో పలు
అభివృద్ధి పనులకు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం.
ముఖ్యమంత్రి దార్శనికతతో మరే రాష్ట్రం అమలు చేయని విధంగా తెలంగాణ ప్రభుత్వం
ప్రతి ఏటా రూ.50 వేల కోట్లకు పైగా నిధులతో ప్రజా సంక్షేమ పథకాలు అమలు
చేస్తోంది. దేశానికే ఆదర్శంగా నిలిచిన ఆసరా ఫించన్లు, ఇతర సంక్షేమ పథకాలు
పేదల్లో ఆర్థిక భరోసాను ఆత్మగౌరవాన్ని నింపాయి. పెన్షన్లతో పాటు రైతులకందించిన
పంట పెట్టుబడి వంటి వ్యక్తిగత ఆర్థిక సాయం సామాజిక పెట్టుబడిగా మారింది.
ముఖ్యమంత్రి కెసిఆర్ ‘మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ఆకాంక్ష
నెరవేర్చారు. దీనివల్ల వేలాదిమంది గిరిజన యువతీ, యువకులు సర్పంచులుగా, వార్డు
మెంబర్లుగా రాజకీయా ధికారంలో భాగమయ్యేలా చేసిన ఘనత కేసీఆర్‌దే. గిరిజనుల సమగ్ర
అభివృద్ధికి ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజనుల రిజర్వేషన్లను
10 శాతానికి పెంచడంతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయి. గిరిజన విద్యార్థుల
కోసం ప్రత్యేకంగా 93 గురుకుల విద్యాలయాలను నెలకొల్పింది. మరో మూడు గురుకుల
విద్యాలయాలను ఏర్పాటు చేసుకోబోతున్నము. వీటి లో రెసిడెన్షియల్ డిగ్రీ
కాలేజీలు, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు, లా కాలేజీలు, సైనిక్ స్కూళ్లు, కాలేజ్
ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో నర్సపేట శాసనసభ్యులు పెద్ది
సుదర్శన్ రెడ్డి,డి సి ఎం ఎస్ చైర్మన్ రామస్వామి, జిల్లా, జడ్పీ ఫ్లోర్ లీడర్
పెద్ది స్వప్న, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య ఇతర అధికారులు తదితరులు
పాల్గొన్నారు.