మిద్దె పై సేంద్రియ వ్యవసాయం శుభపరిణామం
ప్రతీ ఒక్కరూ మొక్కలను పెంచి కాలుష్యాన్ని నివారించండి
జానుస్ నేచర్ మిద్దె తోటను సందర్శించిన విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి
విశాఖపట్నం : ప్రతీ ఇంటిని వ్యవసాయ క్షేత్రంగా మార్చుకోవడం ద్వారా రాబోయే
తరాలకు ఆరోగ్యాన్ని అందిచే వాళ్ళు అవుతారని విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంకట
కుమారి అన్నారు. శుక్రవారం జోన్ -2 పరిధిలో 7వ వార్డులో, ఐ టైలర్స్ కోలనీలో
గల జానుస్ నేచర్ మిద్దె తోటను ఆమె సందర్శించారు. 60 గజాల మిద్దె మీద అనేక
రకాల పండ్లు,కూరగాయలు,ఆకుకూరలు, ఔషధ మొక్కలను పెంచుతున్న ఝాన్సీని మేయర్
హరివెంకట కుమారి అభినందించారు. ఝాన్సీని ప్రతీ ఒక్కరూ అందర్శంగా తీసుకొని
కొంచెం సమయం వెచ్చించి సేంద్రియ పద్దతుల్లో ఎవరికి కావాల్సిన కూరగాయలు,
పండ్లను పండిచుకొని ఆరోగ్యంగా జీవించాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ ఇళ్లపైన ,
కాంపౌండ్ పరిసరాల్లో మొక్కలను పెంచడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చని
తద్వారా భావితరాలకు మంచి పర్యావరణాన్నీ అందించగలమని నగర ప్రజలు పిలుపునిచ్చారు.
అనంతరం జోనల్ కమిషనర్ కనక మహాలక్ష్మి మాట్లాడుతూ తక్కువ స్థలంలో ఎక్కువ
మొక్కలను పెంచుతూ వాటి ద్వారా పండ్లు ,కూరగాయలను పండించడం శుభపరిణామమని
అన్నారు. ప్రతీ ఒక్కరూ బంగారు ఝాన్సీని ఆదర్శంగా తీసుకొని మిద్దె తోటలను సాగు
చేసుకోవాలని సూచించారు . అనంతరం జానుస్ నేచర్ ఝాన్సీ మిద్దె తోట నిర్వహణలో
తాను అవలంభిస్తున్న పూర్వీకుల నాటి సేంద్రియ పద్ధతులను మేయర్ కు వివరించారు.
రసాయనిక అవశేషాలు లేని ఆకుకూరలు, కాయలు, పండ్లు పండిస్తూ తన కుటుంబ సభ్యులకు
ఆరోగ్యం అందించడంతో పాటుగా సేంద్రియ వ్యవసాయం పట్ల అందరిని చైతన్యం
చేస్తున్నాని అన్నారు. తనను చూసి కొందరైన మిద్దె తోటలను సేంద్రియ విధానంలో
పండిచుకొని ఆరోగ్యంగా జీవించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం మేయర్
దంపతులను సత్కరించి మిద్దె తోటలో కాసిన పండ్లను అందజేశారు. సేంద్రియ విధానం
ద్వారా పండించిన పండ్లను రుచి చూసిన మేయర్ దంపతులు ఆనందం వ్యక్తం చేసారు. ఈ
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు బంగారు ప్రకాష్, వట్టికుల నాగమ్మ ,
పసుపులేటి గోపి , నూకవరపు బాబ్జి ,బెల్లాన పాపారావు , రాజు, ఇజ్జాడ
సత్యన్నారాయణ ,దత్తి వాసు, ఆర్పీలు తెంటు మాధవి , లావణ్య ,రూప, 67వ సచివాలయ
సిబ్బంది పాల్గొన్నారు .