అమరావతి : గ్రోవెరో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సుస్థిర వ్యవసాయ పద్ధతులు,
ఆహార భద్రతకు బలమైన నిబద్ధతతో గ్రో వెరో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే
కొత్త వ్యవసాయ సాంకేతిక సంస్థ అధికారికంగా ప్రారంభించబడింది. గ్రోవెరో
టెక్నాలజీస్ రైతులు పంటలను పండించే విధానాన్ని విప్లవాత్మకంగా మార్చడం,
ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. గ్రోవెరో టెక్నాలజీస్ వ్యవసాయం,
డేటా ఆనలిటిక్స్, టెక్నాలజీలో నిపుణుల బృందంతో వినూత్న పరిష్కారాల ద్వారా
రైతులను బలోపేతం చేయడంపై దృష్టి పెడుతోంది. లాంచ్ ఈవెంట్లో సిఈఒ శ్రీకాంత్
పిజె మాట్లాడుతూ గ్రోవెరో టెక్నాలజీస్ దాని వినూత్న పరిష్కారాలతో రియల్ టైమ్
డేటా, అంతర్ధష్టులతో రైతులను శక్తివంతం చేయడానికి రూపొందిచబడిందనీ తెలిపారు.
తద్వారా వారు అధిక దిగుబడిని సాధించడానికి, ఖర్చులను తగ్గించడానికి
ప్రపంచానికి దోహదపడతాయని పేర్కొన్నారు. గ్రోవెరో వద్ద మేము సాంకేతికత, వ్యయ
పోటీతత్వం, కస్టమర్ సేవల యొక్క ప్రధాన విలువలతో కంపెనీని నిర్మించాలని
లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. అది జరగాలంటే 1000 ఛానల్ భాగస్వాములు,
స్టాక్టెస్ట్పా యింట్స్ యొక్క బలమైన నెట్ వర్క్ ఏర్పాటు చేయడం ద్వారా వ్యవసాయ
కమ్యూనిటీకి నిజ సమయంలో , నమ్మదగ్గిన పరిష్కారాలను అందించడానికి మాకు వీలు
కల్పిస్తుందని కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సురేష్ వేముల తెలిపారు. సేల్స్
హెడ్ భాస్కర్ పున్నా మాట్లాడుతూ గ్రోవెరోకు పంట వైవిధ్యీకరణ వ్యూహం,
విత్తనానికి హార్వెస్ట్ సొల్యూషన్స్ ఉన్నాయి. ఇవి 140 ప్లస్ పంట రక్షణ
రసాయనాల రిజిస్ట్రేషన్లను పొందాయి, వీటిలో పురుగు మందులు, శిలీంధ్ర సంహారిణి,
హెర్బిసైడ్, పిజిఆర్, బయో స్టీమ్యులెంట్లు ఉన్నాయి. మేము పంటల విభాగాలలో
సేవలను అందిస్తున్నామని తెలిపారు.