కార్యదర్శులు భూపతి రాజు రవీంద్ర రాజు, ఎం. అప్పలనాయుడు
విజయవాడ : ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు ఉద్యమంతో
ఉద్యోగులకి ఏమి మేలు జరిగిందో ఉద్యోగ లోకానికి సమాధానం చెప్పాలని ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారులసంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు
భూపతి రాజు రవీంద్ర రాజు, ఎం. అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై
గత మూడు నెలలుగా ఉద్యమం చేస్తే ప్రభుత్వం దిగివచ్చి ఉద్యోగుల సమస్యలు
పరిష్కారం అయిపోయాయని చెప్పడం ఎంతవరకు సబబు అన్నారు. ప్రభుత్వ సలహాదారు
చంద్రశేఖర్ రెడ్డి ఎవరో ఉద్యమం చేస్తే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించలేదని
ప్రభుత్వం ఉద్యోగులకు ఏమి చేయాలో అదే ప్రాధాన్యత క్రమంలో చేస్తుందని
చెప్పారన్నారు. ఏమి సాధించి బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ ఉద్యమాన్ని ఎందుకు
ఎత్తివేసారో తెలపాలన్నారు. అసలు జిపిఎస్ పేరు చెప్తే చర్చలకు వచ్చేది లేదని,
చాయ్ బిస్కెట్ సమావేశాలకు రానవసరం లేదని చెప్పి, సిపిఎస్ రద్దు చేయించి ఓపిఎస్
సాధించారని ఉద్యమం మానేశారా, ఉద్యోగులకు రావలసిన డి ఏ పిఆర్సి అరియర్స్,
వాయిదాల పద్ధతిలో నాలుగు సంవత్సరాలులో 16 విడతలుగా ఇస్తామంటే అది మీరు
సాధించినట్టా, ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డి ఏ లు సాధించారని ఉద్యమాన్ని
నిలిపేశారా, ప్రభుత్వానికి 47 డిమాండ్స్ ఇస్తే 37 డిమాండ్స్ 80%సాధించామని
గొప్పగా చెప్పుకుంటున్న ఏపీ జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
చేస్తున్న ఉద్యమంలో చిత్తశుద్ధి లేదని ముందుగానే మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం తెలియజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏదైనా
ప్రకటిస్తే అది నా గొప్ప అని చెప్పుకోవడం, బొప్పరాజు నైజం, ఇప్పుడు కూడా
ప్రభుత్వం వారు ఏది చేయాలంటే అదే చేస్తారు. బొప్పరాజు వెంకటేశ్వర్లుకి సొంత
ప్రయోజనాలు తప్ప ఉద్యోగుల ప్రయోజనాలు ఏమాత్రం అవసరం లేదు. అందుకే ముందుగా
ఉద్యమం చేస్తున్నట్టు ఉద్యోగులను మోసం చేసి, ఇప్పుడు మా ఉద్యమం వల్లే
ఉద్యోగులకు న్యాయం జరిగిందని చెప్పుకోవడం సిగ్గుచేటు. గతంలో కూడా పిఆర్సి
విషయంలో రివర్స్ పిఆర్సికి 23శాతానికి, 62 సంవత్సరాలకి ఒప్పుకుని ఆరోజుకూడా
ఉద్యోగులకు నష్టం చేయడం జరిగిందని, ఈరోజు కూడా అదే విధంగా జాయింట్ స్టాఫ్
కౌన్సిలింగ్ మీటింగ్లో అన్ని ఒప్పుకుని మరల ఉద్యోగులను మోసం చేయడం
జరిగిందన్నారు. ఇటువంటి చిత్తశుద్ధి లేని జేఏసీలు ఉండడం వల్ల ఉద్యోగులకు
ఎప్పుడు నష్టం జరుగుతూనే ఉంటుందని, అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపై కొచ్చి
ఉద్యోగుల సమస్యలపై పోరాడితే కానీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావని ముందు
నుంచి మా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం చెప్పడం జరిగిందన్నారు . భవిష్యత్తులో
ఉద్యోగులు ఇలాగే ఉంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఉద్యోగులకు న్యాయం చేసే
పరిస్థితులు ఉండవని, అందువలన ప్రతి సామాన్య ఉద్యోగి ఒక్కసారి ఆలోచించి ఈ
రాష్ట్రంలో ఉద్యోగుల కోసం ఎవరైతే చిత్తశుద్ధిగా పనిచేస్తారో వారికి అండగా
నిలవాలని కోరారు.