ఉద్యోగుల ఆందోళనలు ముగించామన్న బొప్పరాజు * 47 డిమాండ్లలో 37 డిమాండ్లను
ప్రభుత్వం పరిష్కరించినట్టు వెల్లడి * ఓపీఎస్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం
ప్రయత్నించాలని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు సూచన *
సియస్ ని సత్కరించిన ఏపిజెఏసి అమరావతి నాయకులు
విజయవాడ : ఉద్యోగుల ఆందోళనలు, ఉద్యమాన్ని ముగించామని ఏపీ జేఏసీ అమరావతి
అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఇచ్చిన 47 డిమాండ్లలో 37
డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించిందని తెలిపారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను
పునర్ వ్యవస్థీకరణ చేయాలని కోరుతున్నామని బొప్పరాజు పేర్కొన్నారు. ఓపీఎస్
విధానం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని అన్నారు. జీపీఎస్ అమలుకు
ముందు మరోసారి సమీక్ష చేపట్టాలని ప్రభుత్వానికి సూచించారు. కాగా ఇవాళ ఏపీ
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కూడా సీఎం జగన్ ను
కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్
తీసుకువస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇప్పుడు ఓపీఎస్ తో సమానంగా
ప్రయోజనం కలిగించేలా జీపీఎస్ ను తీసుకువచ్చారని వివరించారు. ఉద్యోగులు రిటైర్
అయ్యాక భద్రత కల్పించేలా జీపీఎస్ తెచ్చారని తెలిపారు. జీపీఎస్
తీసుకువచ్చినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపామని వెంకట్రామిరెడ్డి
వెల్లడించారు. ఈ ఉద్యమం కాలంలో ప్రధానంగా అనేక శాఖల్లో పనిచేసే చిరు
ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల, మునిసిపల్ శాఖలో పనిచేసే మునిసిపల్
కార్మికులు, ఇటీవల నియామకం అయిన గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగులు చాలా
ఇబ్బందులు పడుతున్నట్లు మేము ప్రత్యక్షంగా చూసాము..విన్నాము కనుక, భవిష్యత్
లో అంటే రేపటినుండి కాంట్రాక్టు, ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు, మునిసిపల్
కార్మికులు, గ్రామ వార్డ్ సచివాలయం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేందుకు
ప్రభుత్వంతో మాట్లాడి ఆసమస్యలు కూడా పరిష్కారానికి కృషిచేయడమే లక్ష్యంగా
పెట్టుకుంటామని ఏపిజెఎసి అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు
వెంకటేశ్వర్లు,సెక్రటరీ జెనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్ చైర్మన్
టి.వి.ఫణిపేర్రాజు, కోశాధికారి వి.వి.మురళీకృష్టనాయుడు తెలిపారు. ఈ సమావేశంలో
చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి
ప్రభుత్వప్రధానకార్యదర్శికి ఇచ్చిన మెమోరాండంలోఉన్న 48 డిమాండ్లులో 37
డిమాండ్లు పరిష్కరించేవిదంగా ఆదేశాలు కూడా జారీ అయ్యాయని మిగిలిఉన్న 11
డిమాండ్లు పరిష్కారానికి కూడా కృషిచేస్తామని అన్నారు. జీపీఎస్ విధానం దేశానికి
రోల్ మోడల్ లా ఉంటుందని, జీపీఎస్ తో నష్టం ఉండదని, మేలు జరుగుతుందని సీఎం
చెప్పారని వివరించారు. ఇక ఇళ్ల స్థలాల డిమాండ్ పై ముఖ్యమంత్రి సానుకూలత
వ్యక్తం చేశారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఏపిజెఏసి అమరావతి స్టేట్ సెక్రటరీ
జెనరల్,ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పలిశెట్టిదామోదరరావు మాట్లాడుతూ
ఈ ఉద్యమం ఉద్యోగలోకంలో చారిత్రాత్మక ఉద్యమని ఈ ఉద్యనం జరగడానికి కారణం ఇంతవరకు
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందువల్లనే
జరిగింది. భవిష్యత్ లో అలా జరగకుండా చూడాలని,ఈ ఉద్యమం ద్వారా ఆర్టీసి
ఉద్యోగులకు చెందిన ఏడు డిమాండ్లు పరిష్కరించుకోవడం జరిగింది. ఇంకా
పరిష్కారించాల్సిన సమస్యలలో ప్రధానంగా నైట్ హాల్ట్సు అలవెన్సులు, అఫీల్సు
పరిష్కారానికి ఆదేశాలు,లీవ్ ఎన్ క్యాష్ మెంటు, రిటైర్, చనిపోయిన వారికి
రావల్సిన షెటిల్ మెంట్లు ఇవ్వాల్సి ఉందని అన్నారు.ఆర్టీసి ఉద్యోగులుకూడా
ఓపియస్ వర్తిస్తుందన్న ఆశతోనే విలీనం కోరుకున్నామని తెలిపారు. అలాగే
ఈసమావేశంలో అసోషియేట్ చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు మాట్లాడుతూ భవిష్యత్ లో
సమస్యలు రాకుండా ఉండాలంటే అన్ని విభాగాల శాఖాధిపతులు ప్రతినెలా ఉద్యోగసంఘాలతో
గీవెన్సు డేను నిర్వహించాలని విజ్ఞప్తి చేసారు. ఔట్ సోర్శింగు ఉద్యోగుల సంఘం
అధ్యక్షులు సుమన్ మాట్లాడుతూ కాంట్రాక్టుఉద్యోగులను క్రమబద్దికరించేందుకు
నిర్ణయం చేసినందుకు ముఖ్యమంత్రికి కృతగ్జతలు తెలియజేస్తు మిగిలిన ఉన్నవారిని
కూడా క్రమబద్దికరించేందుకు షెడ్యూల్ ప్రకటించాలని,ఔట్ సోర్శింగు ఉద్యోగులకు
జీతాలు పెంపుదల చేయాలని విజ్ఞప్తి చేసారు. అలాగే గ్రామవార్డు సచివాలయ ఉద్యోగల
సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వి.అరలయ్య మాట్లాడుతూ
బదిలీలుాసమస్యను,టార్గెట్ ఇచ్చేసమస్యలను పరిష్కరించారని ఇంకా మిగిలిఉన్న
సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. ఏపి ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల
రాష్ట్ర సంఘం నాయకులు పుల్లయ్య మాట్లాడుతూ ప్రతి నెల పెన్షన్ ఒకటో తారీకు
ఇచ్చేవిధానంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
సియస్ ని సత్కరించిన ఏపిజెఏసి అమరావతి నాయకులు : ఉద్యోగుల సమస్యలు పరిష్కారంలో
నిరంతరం ఉన్నతాధికార్లుతో పలుమార్లు రివ్యూలు నిర్వహిస్తూ ఉద్యోగుల
పరిష్కరించేందుకు చిత్తశుద్దితో వ్యవహరించడమే కాకుండా, ప్రభుత్వపెద్దల
దృష్టికి కూడా ఉద్యోగుల డిమాండ్లను తీసుకొని వెళ్ళి, ఢిల్లీ నుండి కూడా వీడియో
కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేసిన రాష్ట్ర ప్రభుత్వ
ప్రధాన కార్యదర్శి కే.యస్. జవహర్ రెడ్డి ని ఘనంగా వారి విజయవాడ క్యాంప్
కార్యాలయం లో సత్కరిస్తూ, ఏపిజెఏసి అమరావతి నాయకులు వారికి ప్రత్యేక కృతగ్జతలు
తెలియజేసారు. ఈ సమావేశంలో ఏపిజెఏసి అమరావతి రాష్ట్రనాయకులు టివి ఫణి
పేర్రాజు, వివి మురళి కృష్ణ నాయుడు, శంసాని శ్రీనివాసరరావు,
యస్.మల్లేశ్వరరావు, బి.కిశోర్ కుమార్, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.