ఖమ్మం : తాను ఏ పార్టీలో చేరనున్నది హైదరాబాద్ వేదికగా త్వరలోనే
వెల్లడిస్తానని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అభిమానులు,
అనుచరులు, కార్యకర్తల అభీష్టమే తన అభిమతమని.. రాబోయే మూడు, నాలుగు రోజుల్లో
పార్టీ మార్పుపై అధికారికంగా ప్రకటిస్తానని పేర్కొన్నారు. లక్షలాది మంది
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటానని పొంగులేటి
స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై బీఆర్ఎస్ బహిష్కృత నేత, ఖమ్మం
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు, అనుచరులకు పరోక్షంగా
స్పష్టతనిచ్చారు. అభిమానులు, అనుచరులు, కార్యకర్తల అభీష్టమే తన అభిమతమని..
రాబోయే మూడు నాలుగు రోజుల్లో పార్టీ మార్పుపై అధికారికంగా ప్రకటిస్తానని
స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఓ కన్వెన్షన్ హాల్లో ఉమ్మడి ఖమ్మం
జిల్లాకు చెందిన 10 నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులతో పొంగులేటి ప్రత్యేక
సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల నుంచి ముఖ్య నాయకులు
తరలివచ్చారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఏడుగురు చొప్పున మొత్తం 70 మంది
నాయకులతో సమావేశంలో మాట్లాడించారు. వీరిలో ఎక్కువ మంది నాయకులు పొంగులేటిని
కాంగ్రెస్ పార్టీలో చేరాలని కోరారు. అనంతరం పొంగులేటి మాట్లాడుతూ నాయకులు,
కార్యకరక్తల మనస్సులో మొదటి నుంచీ ఒకే నిర్ణయం ఉందని, అందరి అభిప్రాయం మేరకు
పార్టీలో చేరికపై హైదరాబాద్ వేదికగా అధికారిక ప్రకటన చేస్తానని స్పష్టం
చేశారు. 3, 4 రోజుల్లోనే పార్టీలో చేరే తేదీ, ఖమ్మం బహిరంగ సభ తేదీని
ప్రకటిస్తాని వెల్లడించారు. ఈ క్రమంలోనే లక్షలాది మంది ఉమ్మడి ఖమ్మం జిల్లా
నేతల సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటానని పేర్కొన్నారు. తమతో పాటు కలిసి
వచ్చే మరికొందరిని సమీకరించుకుని రాబోయే కురుక్షేత్ర యుద్ధానికి పూర్తిగా
సన్నద్ధమవుతున్నామని తెలిపారు. రాష్ట్రానికి కల్వకుంట్ల కుటుంబం నుంచి
విముక్తి కల్పించడమే లక్ష్యమని పొంగులేటి పునరుద్ఘాటించారు.