అక్టోబర్ 17న ముసాయిదా ఓటర్ల జాబితా
జనవరి 5వ తేదీన తుది జాబితా
ఆదేశాలు జారీ చేసిన ఈసీఐ
న్యూ ఢిల్లీ : పార్లమెంటు, అసెంబ్లీ సాధారణ ఎన్నికలు వచ్చే ఏడాది జరుగనున్న
నేపథ్యంలో అర్హులందరినీ ఓటర్లుగా చేర్చేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
(ఈసీఐ) సమాయత్తం అయింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం – 2024 కు
సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. 2024 జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండిన
ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని చీఫ్ ఎలక్టోరల్ అధికారులకు ఆదేశాలు జారీ
చేసింది. ఈసీఐ విడుదల చేసిన షెడ్యూల్ కలెక్టరేట్ కు వచ్చింది. ఓటర్ల జాబితా
సవరణ, ప్రీ రివిజన్ యాక్టివిటి, రివిజన్ యాక్టివిటీ అనే రెండు దశల్లో
సాగుతుంది. ప్రస్తుతం ప్రీ రివిజన్ యాక్టివిటీని జిల్లా యంత్రాంగం చేపట్టనుంది.