అమరావతి : భారతదేశ పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు 5 రోజుల
పర్యటన నిమిత్తం జూన్ 10న నెల్లూరు రానున్నారు. జూన్ 14 వరకూ నెల్లూరు
జిల్లాలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. జూన్ 10న రైలు మార్గంలో
రాత్రి 7 గంటలకు నెల్లూరు చేరుకుంటారు. సర్దార్ పటేల్ నగర్ లోని కుమారుడి
నివాసంలో బస చేస్తారు. జూన్ 11న నర్రవాడ వెంగమాంబ తిరుణాళ్ళకు బయలుదేరి వెళ్ళి
అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఉదయగిరి ప్రజలు నిర్వహిస్తున్న ఆత్మీయ
సమావేశంలో పాల్గొని నెల్లూరు తిరిగి చేరుకుంటారు. రాత్రికి సర్దార్ పటేల్ నగర్
లోని నివాసంలో బస చేస్తారు. జూన్ 12న శ్రీ కస్తూరి దేవి స్కూల్ ప్రాంగణంలోని
డా. రవీంద్రనాథ్ ఠాగూర్ భవనంలో గురువుకి వందనం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా
పాల్గొంటారు. వారి గురువు మోపూరు వేణుగోపాలయ్య స్మృతి సంచికను
ఆవిష్కరిస్తారు. రాత్రికి వెంకటాచలం స్వర్ణభారత్ ట్రస్ట్ లో బస చేస్తారు. జూన్
13న స్వర్ణభారత్ ట్రస్ట్ లో నిర్వహించనున్న ఎన్టీఆర్ శతజయంతి కార్యక్రమంలో
ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. జూన్ 14న రాత్రి 8 గంటలకు రైలు మార్గంలో హైదరాబాద్
బయలుదేరి వెళతారు.