హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను బసవతారకం ఇండో అమెరికన్
క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో శనివారం ఘనంగా
నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకు ని హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన
కార్యక్రమంలో నందమూరి బాలకృష్ణ క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారుల సమక్షంలో
భారీ కేక్ ను కట్ చేశారు. చిన్నారులకు కేక్ ను తినిపించారు. అనంతరం హాస్పిటల్
లో క్యాన్సర్ చికిత్స అందుకొంటున్న చిన్నారులకు తన పుట్టిన రోజును
పురస్కరించుకొని ప్రత్యేక కానుకలు అందజేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన
సిబ్బంది, వైద్యులు, రోగులు, అభిమానుల నుద్దేశించి మాట్లాడుతూ ప్రతి పుట్టిన
రోజు తనకున్న భాద్యతలను గుర్తు చేస్తందన్నారు. ఈ భూమి మీద అందరూ పుడుతారు
కాని మహానుభావులు కాలేరని కొందరు మాత్రమే మనం ఎందుకు పుట్టాం, ఎలా సమాజానికి
ఉపయోగపడుతాం అని ఆలోచించి పని చేస్తారని వారు మాత్రమే మహానుభావులుగా
పిలువబడుతారన్నారు. ఈ కోవకు చెందిన వారే స్వర్గీయ నందమూరి తారక రామారావు
గారని అన్నారు. వారు ముఖ్యమంత్రిగా, నటుడుగా, ఆసుపత్రి వ్యవస్థాపకునిగా ఎన్నో
మంచి పనులు చేయగలిగారని తాను కూడా అలానే ముందుకు సాగాలని భావిస్తున్నట్లు
చెప్పారు. మనం ఎపుడైతే మన శరీరాన్ని మనస్సు ఆధీనంలోనికి
తీసుకోగలుగుతామో….వయస్సును మరచి మేధస్సుతో చురుకుగా పని చేయడాన్ని నాన్న
గారి నుండి నేర్చుకొన్నా దానినే అనుకరిస్తానని చెప్పారు. అందుకే నేను 63
సంవత్సరాలను 36 సంవత్సరములుగా భావిస్తూ ముందుకు సాగుతున్నానని చమత్కరిస్తూ
తద్వారా మరించ చురుకుగా మంచి పనులు చేయడానికి ఆస్కారం కలుగుతోందని చెప్పారు.
తన తండ్రి పేద వారికి అందుబాటైన ధరలలో నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో
నెలకొల్పిన ఈ ఆసుపత్రి ఎందరికో ఎటువంటి లాభాపేక్ష లేకుండా కేవలం సేవా
దృక్పధంతో సేవలు అందిస్తోందని అంటూ భవిష్యత్తులోనూ నిరంతరాయం ఈ సేవలు
అందించేందుకు కృషి చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమాలలో నందమూరి బాలకృష్ణ,
ఛైర్మన్ తో పాటు జెయస్ ఆర్ ప్రసాద్, ట్రస్టు బోర్డు సభ్యులు, డా. ఆర్ వి
ప్రభాకర రావు, డా. కస్పనా రఘునాథ్, ఆసోసియేట్ డైరెక్టర్, అకడమిక్స్ మరియు యాడ్
లైప్, డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, డా. సెంథిల్ రాజప్ప,
హెడ్, మెడికల్ ఆంకాలజీ విభాగం, డా. వీరయ్య ఛౌదరి, హెడ్, రేడియాలజీ విభాగం
హరిత, హెడ్, సోషల్ వర్కర్స్ విభాగాలతో పాటు పలువురు వైద్యులు, నర్సింగ్, పారా
మెడికల్ సిబ్బంది, రోగులు, వారి కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.