బిహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన లేదని బిహార్ బీజేపీ
అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి విమర్శించారు. ఆయన్ను 50 ఏళ్ల పిల్లాడిగా
భావిస్తుంటామని చెప్పుకొచ్చారు. గడ్డం పెంచితే ప్రధాని అవుతారా అని ఎద్దేవా
చేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిహార్ బీజేపీ అధ్యక్షుడు
సామ్రాట్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరారియాలో ఓ బహిరంగ సభలో
ప్రసంగించిన ఆయన.. రాహుల్ గాంధీని, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్లాడెన్తో
పోల్చుతూ మాట్లాడారు. బిన్లాడెన్లా గడ్డం పెంచినంత మాత్రాన ప్రధాని కాలేరని
విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తనను తాను 50 ఏళ్ల పిల్లాడిలా అనుకుంటున్నారని
ఎద్దేవా చేశారు.