అందరికీ నాణ్యమైన పుస్తకాలు బట్టలు,బూట్లు ఇస్తున్నాం – వెలంపల్లి
విద్యకు పెద్ద పీట వేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి – వెలంపల్లి
విదేశీ విద్య పేరుతో విద్యార్థులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు – వెలంపల్లి
విజయవాడ పశ్చిమ : స్థానిక 37వ డివిజన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ గ్రాండ్
నందు 4వ విడత విద్య కానుక కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో
మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ముఖ్య
అతిథిగా పాల్గొని పశ్చిమ నియోజకవర్గంలో గల 66 స్కూల్ లలో చదువుకునే 11242
మంది బాల బాలికలకు 2 కోట్ల 92 లక్షల 29 వేల 2 వందల రూపాయల విలువైన కిట్లా
పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ
అందరికీ నాణ్యమైన పుస్తకాలు బట్టలు,బూట్లు ఇస్తున్నామన్నారు.బట్టల కుట్టుకులు
కూడా ప్రభుత్వం ఇస్తుందన్నారు.ప్రైవేట్ బడులకు దీటుగా ప్రభుత్వా బడులు
నడుస్తున్నాయన్నారు. విద్యకు పెద్ద పీట వేస్తూన్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
అని కొనియాడారు. గతంలో విద్యార్థులను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అని
అన్నారు.విదేశీ విద్య విధానం పేరుతో విద్యార్థులను మోసం చేసిన వ్యక్తి
చంద్రబాబు అని దుయ్యబట్టారు.చదువు ద్వారా బాల బాలికలకు మంచి చేస్తున్న వ్యక్తి
జగన్ మోహన్ అని అన్నారు.ఎన్నడూ లేనివిధంగా స్కూల్ తెరిచిన రోజే కానుక ఇవ్వడం
జరుగుతుందన్నారు.పిల్లలు బాగా చదువుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక
కార్పొరేటర్ మండేపూడి చటర్జీ,ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకళ్ళ విద్యాధర
రావు, స్కూల్ ప్రిన్సిపల్ పి నీరజా,సమగ్ర శిక్ష కొ ఆర్డినేటర్ మహేశ్వర రావు
తదితర నాయకులు, కార్యకర్తలు, విద్యా శాఖ అధికారులు, స్కూల్ విద్యార్దిని
విద్యార్దులు పాల్గొన్నారు.