విజయవాడ
ప్రభుత్వం నిషేధించిన జీవో ల గురించి కూడా తెలుసుకోకుండా టీడీపీ అధికార
పార్టీ స్పోక్ పర్సన్ గా సయ్యద్ రఫీ ఎలా నియమితులయ్యారు అని ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర భట్రాజు సంఘం మహిళా అధ్యక్షురాలు పాలగిరి చంద్రకళ ఓ ప్రకటనలో
ప్రశ్నించారు. బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా టీడీపీ మైనారిటీ నాయకులు రఫీ
భట్రాజుల గురించి అభ్యంతరకరంగా మాట్లాడటం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ఉద్యోగ సంఘాల నాయకులారా జగన్ రెడ్డి భజన ఆపండి ఉద్యోగులు మిమ్మల్ని చూసి “చీ”
కొడుతున్నారు అంటూ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ఉద్యోగులను
ఉద్దేశించి మాట్లాడుతూ పూర్వము భట్రాజులు ఉండేవారు వారు రాజు వస్తుంటే
రాజాధిరాజ రాజమార్తాండ అంటూ రాజును పొగుడుతూ మాట్లాడేవారంటూ భట్రాజుల
మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రెస్ మీట్ లో మాట్లాడటం వారి అజ్ఞానానికి
నిదర్శనమన్నారు. భట్రాజుల చరిత్ర తెలుసుకోకుండా వారిని కించపరుస్తూ మాట్లాడితే
చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విశేషమైన గొప్ప చరిత్ర కలిగిన భట్రాజు
కులస్తులకు టీడీపీ నేత సయ్యద్ రఫీ వెంటనే క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్త
ఆందోళన చేస్తామన్నారు. బీసీలకు పెద్దపీట వేస్తాం, వారికి గౌరవాన్ని తెస్తామని
చెప్పే టీడీపీ పార్టీకి బాధ్యతాయుతమైన అధికార ప్రతినిధిగా ఉంటూ బీసీల చరిత్ర
తెలుసుకోకుండా, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము తమజాతిని ఎంతో గౌరవించి “భట్రాజు
పొగడ్తలు” అనే పదాన్ని నిషేధించిన విషయం కూడా తెలుసుకోకుండా మాట్లాడడం బీసీలను
కించపరచడమే అవుతుందని పేర్కొన్నారు.