హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. గచ్చిబౌలి
ఏఐజి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారు జామున 5 గంటల ప్రాంతంలో
దయాకర్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా కాన్సర్ వ్యాధితో దయాకర్
రెడ్డి బాధపడుతున్నారు. మూడుసార్లు టీడీపీ తరపున కొత్తకోట దయాకర్ రెడ్డి
ఎమ్మెల్యేగా గెలిచారు. అమరచింత నుంచి రెండుసార్లు మక్తల్ నుంచి ఒకసారి
ఎమ్మెల్యేగా విజయం సాధించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి గాను దయాకర్
రెడ్డి పనిచేశారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి
మృతి పట్ల మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
దయాకర్‌రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం
ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి
మృతిపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
దయాకర్ రెడ్డి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ
సభ్యులకు మనోధైర్యం కల్పించాలని భగవంతుడిని కోరుతున్నట్లు డీకే అరుణ ఓ
ప్రకటనలో వెల్లడించారు…!!