కృతజ్ఞతలు తెలిపిన “పెన్”
విజయవాడ : ప్రాంతీయ పత్రికలకు ఇకనుండి యాడ్స్ ఇచ్చేందుకు సమాచార పౌర
సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి అంగీకరించారు. ఎన్నో కష్టాలను
ఓర్చి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రాంతీయ పత్రికల కు యాడ్స్ ఇచ్చి
ఆదుకోవాలని “పెన్” జర్నలిస్ట్స్ సంఘం సమాచార పౌరసంబంధాలా శాఖ కమిషనర్ విజయ్
కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవారం ప్రింట్ అండ్
ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ (పెన్ ) సంఘ
నేతలు విజయవాడ కమిషనర్ కర్యాలయంలో విజయ్ కుమార్ రెడ్డిని కలసి విజ్ఞాపన
పత్రం సమర్పించారు. చిన్న పత్రికల మనుగడ ప్రశ్నర్ధకంగా ఉన్న పరిస్థితుల్లో
ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.ఈ విషయం పై స్పందించిన కమిషనర్
చిన్న పత్రికలకు సైతం యాడ్స్ ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. అదే రీతిలో
అక్రిడిటేషన్స్ విషయంలో చిన్న పత్రికలకు అన్యాయం జరిగిందని,ఆర్ఎన్ఐ
సీనియారటి అనుసరించి , నిబంధనలు సడలించి అక్రిడిటేషన్స్ ఇవ్వాలని
కోరారు.చిన్న పత్రికలకు జిల్లాలలో 1+1 అక్రిడిటేషన్స్ గతంలో మాదిరిగా
ఇవ్వాలని “పెన్” రాష్ట్ర సంఘ అధ్యక్షులు బడే ప్రభాకర్ కోరారు. రెండు
విషయాల్లోను సానుకూలంగా స్పందించిన కమిషనర్ అంగీకారం తెలిపారు. ఐతే ఎంపానల్
మెంట్ ఉన్న పత్రికలకు యాడ్స్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ విషయం పై ప్రభాకర్
స్పందించి పత్రికలు ఎంపానల్ చేసుకునేందుకు నిబందనలు సవరించి సరళీకృతం చేసి
అందరికీ అవకాశం కల్పించాలన్నారు. ఈ సందర్బంగా సానుకూలంగా స్పందించి న కమిషనర్
కు సంఘ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ ను కలసిన వారిలో పెన్ రాష్ట్ర సంఘ
కార్యదర్శి బద్దం సుమ ఉపేందర్ , స్టేట్ ట్రజరర్ టీవి రంగారావు తదితరులున్నారు.