లేదంటే ఛలో విజయవాడకు సన్నద్ధం
అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం
విజయవాడ : రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏపీయూడబ్ల్యూజే సమర
శంఖం పూరించింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు,
ఇళ్లస్థలాల సమస్యతో పాటు దీర్ఘకాలిక సమస్యలపై పరిష్కారంపై దోళన బాట పట్టాలనే
ఏపీయూడబ్ల్యూజే మంగళవారం విజయవాడలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో
నిర్ణయించారు. రాష్ట్రంలోని వేలాది జర్నలిస్టులతో ఛలో విజయవాడ చేపట్టేందుకు
కార్యాచరణ రూపొందించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే నేతలు స్పష్టం చెశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం. జర్నలిస్టులకు కనీస స్వేచ్ఛ లేదని, ఇక రాష్ట్రం లో
ప్రజా స్వామ్యం ఎక్కడ ఉందని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే.శ్రీనివాస
రెడ్డిప్రశ్నించారు. జర్నలిస్టుల సమస్యలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం
విజయవాడలోని శ్రీరామా ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశంలో
శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ అధికారంలో ఉంటే ఒకలా.. ప్రతిపక్షం లో ఉంటే మరోలా
నేతలు వ్యవహరిస్తున్నారనారు. పత్రికా స్వేచ్చ పేరుకే తప్ప ఎక్కడా కనిపించడం
లేదని, ఇటీవల పరిణామాలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయని తెలిపారు. గత తన 50ఏళ్ల
ఉద్యమ జీవితంలో బ్రహ్మానంద రెడ్డి మినహా అందరు ముఖ్యమంత్రులతో సమస్యలపై
చర్చించి పరిష్కరించుకున్నాము తప్ప ఇలాంటి ముఖ్యమంత్రిని ఇప్పటి వరకు
చూడలేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పత్రికల వల్లే చంద్రబాబు నష్టపోయారన్నారు.
వాస్తవాలు దాచి అంతా బాగున్నాయని చెప్పడం వల్లే ఆ పరిస్థితి వచ్చిందన్నారు.
నేడు మీడియా పై దాడులు చాలా పెరిగాయని తెలిపారు. చంద్రబాబు పాలనే చాలా
మెరుగ్గా ఉందని ఒక జర్నలిస్టు గా భావిస్తున్నానని అన్నారు. కరోనా తో చనిపోయిన
వారి కుటుంబాలకు ప్రభుత్వాలు సాయం అందించాయి. మరి జర్నలిస్టు లు ఇక్కడ ఏం పాపం
చేశారని శ్రీనివాస రెడ్డి నిలదీశారు. ఊరూరా తిరిగి వార్తలు రాస్తూ కరోనా బారిన
పడితే కనీస సాయం చేయలేదని, జర్నలిస్టులకు ఇస్తే.. అందరూ అడుగుతారని ఆపడం ఎంత
దుర్మార్గమని ఆయన అన్నారు. సిఎం స్వయంగా హామీ ఇచ్చి, జిఒ ఇచ్చి కూడా రూపాయి
ఇవ్వలేదని చెప్పారు. జర్నలిస్టు ల పట్ల ఈ ప్రభుత్వం ఇంత నిర్దాక్షిణ్యంగా
ఎందుకు వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన సాయం
చూసైనా స్పందించ లేదంటూ జర్నలిస్టు లు సమాజంలో భాగమే కదా? అని ఆయన
పేర్కొన్నారు. అక్రిడేషన్ ల జారీలో అధికారులు కూడా అడ్డగోలుగా
వ్యవహరిస్తున్నారు. చిన్న పత్రికలకు ఇన్ కం ట్యాక్స్ అడిగారు. అక్రిడేషన్ కు,
ఇన్ కం ట్యాక్స్ కి అసలు సంబంధం ఏమిటి? ప్రభుత్వాల అవినీతి, అక్రమాలు
వెలుగులోకి తెస్తే ఎదురు కేసులు ఎట్టిస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు.
పోలీసులకే రక్షణ లేదు : రాష్ట్రంలో పోలీసులకే రక్షణ లేదని సీపీఐ రాష్ట్ర
కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. వైసిపి రౌడీ మూకలు పోలీసులు ను దూషిస్తున్నా
కేసులు లేవన్నారు. జగన్ పై నుంచి ఊడి పడినట్లుగా భావిస్తున్నాడని తెలిపారు.
జర్నలిస్టు ల సహకారం లేకుంటే రాజకీయ పార్టీలు అభిప్రాయాలు ప్రజల్లోకి ఎలా
వెళతాయని, నేడు ప్రతి పోరంబో కు వెధవ జర్నలిస్టు ను తిడుతున్నాడని
మండిపడ్డారు. జగన్ ప్రతిపక్షంలో ఉంటే మీడియా ను పిలిచి ఇంటర్వ్యూ లు ఇచ్చాడని,
ఇప్పుడు కనీసం మీడియా ముందుకు వచ్చే ధైర్యం జగన్ కు లేదని తెలిపారు. జగన్
అవినీతి బయట పెట్టిన పత్రికలు ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర కు ప్రకటనలు ఆపేశారని,
ఇది నీ యబ్బ జాగీరా అంటూ ప్రశ్నించారు. వెధవలు ఉన్నత స్థానంలో ఉంటే ఇదే
పరిస్థితి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సజ్జల తప్ప అందరూ పేరుకే
సలహాదారు.. వాళ్లు చేసేదేమీ లెదన్నారు. ప్రజాస్వామ్యానికే ఈ రాష్ట్రం లో
ప్రమాదం ఏర్పడిందన్నారు. జర్నలిస్టు లు కూడా ధైర్యం గా పోరాదితే తాము అండగా
ఉంటామని, ఛలో విజయవాడ చెపడితే కుటుంబాలతో సహా రావాలని కోరారు.
దున్నపోతు మీద వర్షం పడినట్లే : రాష్ట్రంలో ఆందోళనలు చేస్తే ప్రభుత్వం
దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వ్యవహరిస్తోందని మాజీమంత్రి, తెదేపా నేత నక్కా
ఆనందబాబు అన్నారు. తాను 1989 నుంచి నేను క్రియాశీల రాజకీయాల్లో ఉంటూ
జర్నలిస్టుల జీవనం చాలా దగ్గర నుంచి చూశానన్నారు. నాలుగో ఎస్టేట్ ప్రెస్ అని
ఉన్నా సాక్షి వచ్చాక జర్నలిజం విలువ పతనం యిపోయిందని తెలిపారు. గతంలో
జర్నలిస్టు పై దాడి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం నడిచేదని, సాక్షి రాకతో
జగన్ మీడియా మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని విమర్శింఆరు. చంద్రబాబు హయాంలో
జర్నలిస్టు సమస్యలు కొన్ని పరిష్కారం అయ్యాయంటూ వైసిపి ప్రభుత్వానికి
చిత్తశుద్ధి లేకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తుతున్నా యన్నారు. కరోనాతో
చనిపోయిన జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం
ఉందన్నారు. ప్రభుత్వ పధకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాత్రం జర్నలిస్టులు
కావాలన్నారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల పాత్రికేయ వృత్తి నుంచి
వచ్చినవారే కదా? అంటూ ప్రశ్నించారు. కచ్చితంగా హక్కుల కోసం ఉద్యమం
చేయాల్సిందేనంటూ ఎన్ని చేసినా ఈ ప్రభుత్వం పై దున్నపోతు మీద వర్షం
పడినట్లేన్నారు. ఛలో విజయవాడ కు తప్పనిసరి గా పిలుపు ఇవ్వండని కోరిన ఆనందబాబు
ప్రభుత్వం పై సంఘటితంగా పోరాటం చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
అన్ని రోజులూ ఒకేలా ఉండవు : రోజులన్నీ ఒకేలా ఉండవనే విషయం గుర్తుంచుకొని
ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తన వైఖరి మార్చుకోవాలని బీజేపీ
పొలిటికల్ ఫీడ్బ్యాక్ ప్రముఖ్ లంకా దినకర్ అన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టుల
హక్కులను కాలరాసేలా ప్రభుత్వ తీరు ఉందని అన్నారు. నాలుగేళ్లలో వైసీపీ
ప్రభుత్వంలో అక్రమాలు, అవినీతి అనేకం జరిగాయన్నారు. వీటిని వెలికితీసి ప్రజలకు
చెప్పడం పాత్రికేయుల బాధ్యత అంటూ ప్రభుత్వం అవినీతి వెలికితీసిన జర్నలిస్టులపై
అక్రమ కేసులు బనాయిస్తోందని విమర్శించారు. ఇదే ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో
ఉన్నప్పుడు జర్నలిస్టులపై కురిపించిన వరాలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని
పేర్కొన్నారు.
నాలుగేళ్లుగా ఒప్పిక పట్టాం : నాలుగేళ్లుగా జర్నలిస్టు సమస్యలపై పోరాటం
చేస్తూనే ఉన్నామని ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యులు అంబటి ఆంజనేయులు తెలిపారు.
నలభై ఏళ్ల తన పాత్రికేయ వృత్తి జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదని
చెప్పారు. వార్తలు రాస్తే లోపాలు సరిచేసుకోవడం ప్రభుత్వ బాధ్యత అంటూ
కక్ష్యగట్టి జర్నలిస్టుల గొంతు నొక్కాలనుకోవడం దుర్మార్గమన్నారు. సీఎం
స్వయంగా ఇచ్చిన హామీలే అమలు కావడం లేదంటూ పైగా కేసులు పెట్టి ఇబ్బందులకు గురి
చేస్తున్నారని విమర్శించారు. అక్రిడేషన్, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల
విషయంలో ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యం తో వ్యవహరిస్తుందని సమస్యలపై ప్రభుత్వం
స్పందించకుంటే ఛలో విజయవాడ చె
పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
సంపూర్ణ మద్దతు : పాత్రికేయులకు, న్యాయవాదులు సామాజిక మాధ్యతగా ఎంచుకొని ఈ
వృత్తిలోకి వచ్చినట్లు సీనియర్ న్యాయవాది సుంకర రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
జర్నలిస్టులకు భద్రతలేని జాబితాలో భారత్ ఉందంటూ ప్రతి ఏటా జర్నలిస్టులపై దాడుల
విషయంలో దేశంతో పాటు ఏపీ కూడా ఉందన్నారు. పాఠశాల విద్యార్థులు చెట్టుకింద,
పోలీసులు తరగతి గదుల్లో ఉన్నారంటూ వార్తలు రాస్తే కేసులు పెట్టారన్నారు. మహిళా
పోలీసులతో ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించడం ఏ మేరకు న్యాయమన్నారు.
జర్నలిస్టులకు రక్షణ చట్టాలు ఉన్నా అమలు చేయడం లేదంటూ జర్నలిస్టుల సంక్షేమం
పట్టించుకోకుండా ప్రభుత్వం కక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందన్నారు.
రానున్నరోజుల్లో జర్నలిస్టులు చేసే అన్ని రకాల పోరాటాలకు తమ సంపూర్ణ మద్దతు
ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ స్పందన లేదు : రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై వైసీపీ ప్రభుత్వం
స్పందించకపోగా పోరాడి సాధించుకున్న హక్కులను లరాస్తోందని సభకు అధ్యక్షత
వహించిన ఏపీయూడబ్ల్యూజేరాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు చెప్పారు.
అక్రిడిటేషన్, హెల్త్ కార్డులు ఇవ్వడం లేదని, ఎన్నికలకు ముందుచ్చిన హామీ
అమలులో భాగంగా ఇళ్ల స్థలాలు, పెన్షన్ స్కీము అమలు చేయడం లేదన్నారు. మాటల్లో
తప్ప ప్రభుత్వం ఏదీ కూడా చేతల్లో చూపడం లేదని ఆయన విమర్శించారు. కరోనాతో మృతి
చెందిన జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని కోరితే రూ.50 కోట్లు ఇస్తామని
చెప్పడంతో పాటు రూ.5లక్షలు ఒక్కొక్కరికి ఇచ్చేందుకు జీవో కూడా ఇచ్చారన్నారు.
కాని ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి అందలేదని తెలిపారు. సమాచార కమిషనర్
పార్టీ నాయకుని మాదిరి వ్యవహరించడం బాధాకరమంటూ ప్రభుత్వాలు మారినా ఉద్యోగాలు
చెయాలనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. జర్నలిస్టులకు ఇచ్చేందుకు స్థలం
ఎక్కడుందని సీఎం అనడాన్ని బట్టి ఈ ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు వస్తాయనేది
భ్రమేనన్నారు. జర్నలిస్టులపై దాడులు పెరిగినా చర్యలు లేవని ఆయన చెప్పారు.
వర్కింగ్ జర్నలిస్టు అసోసియేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు
మాట్లాడుతూ దురదృష్టవశాత్తు జర్నలిస్టులకు యాజమాన్యాలు జీతాలు
చెల్లించాల్సిందిపోయి యాజమాన్యానికే జర్నలిస్టులు జీతాలు, ప్యాకేజీ ఇచ్చే
పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వానికి వంతపాడే పరిస్థితి రావడం అందుకు
జర్నలిస్టులకు స్వేఛ్చ లేకుండా చేయడం ఎంతో విచారకరమని దీనిపై తప్పకుండా ఒక
కమిషన్ వేయాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్ట్ సంఘాలను అక్రిడిటేషన్ కమిటీలో
ఉంచితే ఎవరు జర్నలిస్టో ఎవరు కాదో తెలియజేస్తామని ప్రభుత్వం ఏక పక్షంగా
అక్రిడిటేషన్ కమిటీలు పెట్టడం ద్వారా నిజమైన జర్నలిస్టులకు అన్యాయం
జరుగుతోందన్నారు. వైసీపీ మానిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని
చెబుతూ నవరత్నాలలో ఒకటిగా చేర్చారని ఐనప్పటికీ ఇప్పటివరకూ ఇవ్వకపోవడం
శోచనీయమన్నారు. జర్నలిస్టులంటే ఒక చిన్న చూపు, నిర్లక్ష్యధోరణిగా వ్యవహరించడం
దారుణమన్నారు. జర్నలిస్టులను ఓ శత్రువుగా చూస్తే తగిన ఫలితం అనుభవిస్తారని
సజ్జలకు హెచ్చరించడం కూడా జరిగిందన్నారు. సీపీఎం మహిళా సంఘం నేత రమాదేవి,
కాంగ్రెస్ నేత నరహరశెట్టి నరసింహారావు, ఐజేయూ కార్యదర్శి డీ.సోమసుందర్, ఆలపాటి
సురేష్ కుమార్ తదితరులు జర్నలిస్టుల ఉద్యమానికి సంఘీభావం తెలపగా, వేదికపైకి
ఆహ్వానితులను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందు జనార్థన్ స్వాగతం
పలుకగా విజయవాడ ప్రెస్ క్లబ్ కార్యదర్శి వసంత్ వందన సమర్పణ చేశారు. ఈ
కార్యక్రమంలో వివిధ జిల్లాలకు చెందిన పాత్రికేయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.