గుంటూరు : ఆగస్టు 7వ తేదీన తిరుపతి ఎస్వీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన
ఓబీసీ మహాసంఘ్ 8వ జాతీయ మెగా కన్వెన్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆల్ ఇండియా బీసీ ఫెడరేషన్
అధ్యక్షుడు జస్టిస్ ఈశ్వరయ్య సహా 15 మంది బీసీ సంఘాల నేతలు సీఎం క్యాంపు
కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మంగళవారం కలిశారు. దీనిలో భాగంగా సీఎం
జగన్‌ను సన్మానించిన వారు.. మహాసంఘ్ జాతీయ మెగా కన్వెన్షన్‌కు రావాలని
ఆహ్వానించారు. ‘బీసీలకు ఎపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. దీనికోసమే తిరుపతి
ఎస్వీ స్టేడియంలో 25వేల మందితో ఒబీసీ మహాసభ నిర్వహించాలని నిర్ణయం. ఆగస్టు 7న
తిరుపతిలో ఒ బీసీ మహాసభ జరుపుతాం. దేశవ్యాప్తంగా జాతీయ జనగణన జరగాలన్నదే మా
డిమాండ్ . బీసీలకు జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యత ఇవ్వాలని మా డిమాండ్. మా
కోరికలపై మహాసభలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మహసభకు సీఎం వైఎస్ జగన్
రావాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు.