ఉత్తర కొరియా : ఉత్తర కొరియాలో ఇటీవలి కాలంలో గణనీయంగా పెరిగిన ఆత్మహత్యల
నివారణకు చర్యలు తీసుకోవాలని దేశాధినేత కిమ్‌జోంగ్ ఉన్ స్థానిక అధికారులను
ఆదేశించారు. దక్షిణ కొరియా నిఘావిభాగ లెక్కల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఉత్తర
కొరియాలో ఆత్మహత్యలు 40 శాతం పెరిగాయి. ఈ నేపథ్యంలో కిమ్ దేశంలో ఆత్మహత్యలను
సోషలిజానికి వ్యతిరేకంగా చేసే రాజద్రోహంగా అభివర్ణించారు. తమ పరిధిలోని
వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడకుండా అడ్డుకోవడంలో విఫలమైతే స్థానిక అధికారులు
బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ర్యాంగాంగ్ ప్రావిన్సులో
ఆకలిచావుల కంటే ఆత్మహత్యలు పెరిగిపోయాయి. కిమ్ ఆదేశాలైతే జారీ చేశారు కానీ,
ఎలా అడ్డుకోవాలనే ప్రణాళికలు అధికారుల వద్ద లేవని రేడియో ఫ్రీ ఆసియా
(ఆర్ఎఫ్ఏ) సంస్థ పేర్కొంది. ఉత్తర కొరియాలో అత్యధికులు పేదరికం, ఆకలి
కారణంగానే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.