చెన్నై : బీజేపీ తో అన్నాడీఎంకే తెగదెంపులు చేసుకునే అవకాశం ఉందనే పరిస్థితి
ప్రస్తుతం తమిళనాడులో నెలకొంది. 2019 లోక్సభ ఎన్నికల నుంచి అన్నాడీఎంకే,
బీజేపీ కూటమి కొనసాగుతోంది. ఇటీవల కాలంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి
పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మధ్య మాటల యుద్ధం జరుగుతూ
ఉంది. అయితే బీజేపీ జాతీయ స్థాయి పెద్దల జోక్యంతో కాస్త సమస్య సద్దుమణిగింది.
ఈ నేపథ్యంలో ఓ వార్తా పత్రికతో అన్నామలై మాట్లాడిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే
వర్గాల్లో దుమారం రేపాయి. తమిళనాడులో 1991 నుంచి 1996 మధ్య కాలంలో అవినీతి
ఎక్కువగా జరిగిందని, మాజీ ముఖ్యమంత్రులను న్యాయస్థానం దోషులుగా తేల్చిందని ఆయన
అన్నారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో అధికారంలో ఉన్న జయలలితను ఉద్దేశించే చేశారని
అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ పార్టీ మాజీ మంత్రులు అన్నామలై
వ్యాఖ్యలను ఖండించారు. మాజీ మంత్రి సీవీ షణ్ముగం మాట్లాడుతూ ఇష్టం లేకపోతే
కూటమి నుంచి వైదొలగొచ్చని, మమ్మల్ని ఎందుకు పట్టుకుని వేలాడుతున్నారని
బీజేపీని ఉద్దేశించి అన్నారు. ఇదిలా ఉండగా మంగళవారం జరిగిన అన్నాడీఎంకే
జిల్లా కార్యదర్శుల సమావేశంలో అన్నామలై వ్యాఖ్యలను ఖండిస్తూ తీర్మానం
ఆమోదించారు. దీంతో అన్నాడీఎంకే బీజేపీ తో తెగదెంపులు చేసుకోనుందా అనే చర్చ
తమిళనాడు రాజకీయ వర్గాల్లో నెలకొంది.