జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు
క్షేత్ర స్థాయిలో మెరుగైన వైద్యం అందించాలనే పల్లె, బస్తీ దవాఖానల ఏర్పాటు
ప్రతి జిల్లా కేంద్రంలో డయాలసిస్ సెంటర్ టీ-హబ్‌ల ఏర్పాటుతో ఉచితంగా పరీక్షలు
నేడు వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే సందర్భంగా మంత్రి పువ్వాడ రక్త దానం
రేడియోలజి ల్యాబ్, డయాలసిస్ సెంటర్, కీమోతెరఫీ వార్డు
ప్రారంభోత్సవం..న్యూట్రిషన్ కీట్స్ పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం : నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అంటూ ఓ సినీ కవి రాసిన పాట ఇప్పుడు
పూర్తిగా రివర్స్ అయిపోయిందని, నేను వస్త బిడ్డో సర్కారు దవాఖానకు అని
పాడుకునే రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు
అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య
దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు
చేసిన రేడియోలజి ల్యాబ్, డయాలసిస్ సెంటర్, కీమోతెరఫీ వార్డు లను మంత్రి
పువ్వాడ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సమకూర్చిన న్యూట్రిషన్
కిట్స్ లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు ఇదే హాస్పిటల్ లో కనీసం సరిపడా డాక్టర్స్
ఉండేవారు కాదు, స్వల్ప సంఖ్యలో నర్సులు, సిబ్బంది ఉండే వారని, కానీ నేడు
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఏ విభాగంకు ఆ విభాగంలో ప్రత్యేక వైద్యులు, నర్సులు,
ఇతర సిబ్బంది ఉన్నారని అందుకు ప్రభుత్వంకు మంత్రి హరీష్ రావుకి ధన్యవాదాలు
తెలిపారు. ఒకప్పుడు 250 పడకలలోనే 500 మంది రోగులు, ఒక్కో బెడ్ కు ఇద్దరు
పేషంట్స్ ఉండేవారని ఇవన్నీ నాకు స్వయంగా తెలుసునని అన్నారు. కానీ నేడు తెలంగాణ
ప్రభుత్వం వచ్చాక 500 బెడ్స్ కు పెంచుకున్నమని, దీనికి తోడు ప్రత్యేక మాతా
శిశు కేంద్రం, ట్రామా కేర్, క్రిటికల్ కేర్ యూనిట్, డయాలసిస్ ఇలా అనేక సేవలు
ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. గర్భిణిల కోసం ఆరోగ్య మహిళ పథకం,
కంటి వెలుగు పథకం ద్వారా కొన్ని లక్షల మందికి ఉచిత కంటి పరీక్షలు చేపట్టి
లక్షల మందికి కంటి అద్దాలను పంపిణీ చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్
కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.166 కోట్ల నిధులను ఇప్పటికే
కేటాయించగా, 100 ఎంబీబీఎస్ సీట్లతో ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం
కానున్నాయని, రూ.9 కోట్లతో కళాశాలకు కేటాయించిన పాత కలెక్టరేట్ భవనం ఆధునీకరణ,
రూ.3.5 కోట్లతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి మంజూరు చేసుకున్నామని వివరించారు. ప్రతి
పీహెచ్సీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి జిల్లా ప్రధాన ఆసుపత్రికి వచ్చే
వారికి 134 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తామని, ఈసీజీ, 2డీ ఈకో, ఎక్స్
రే, అల్ట్రా సౌండ్, మెమెగ్రఫీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేస్తున్న టీ డయాగ్నోస్టిక్ హబ్,
రేడియోలజీ ల్యాబ్‌లను ప్రజలు వినియోగించుకోవాలని మంత్రి పువ్వాడ
సూచించారు.
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు అండగా ఉందని, ప్రజలు ప్రయివేటు
ఆసుపత్రికి, ప్రయివేటు స్కానింగ్ సెంటర్లకు వెళ్లొద్దన్నారు. ఏ వైద్య పరీక్ష
కావాలన్నా.. ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు చేస్తారని సూచించారు. తెలంగాణ
ప్రభుత్వం మన జిల్లా ఆసుపత్రిలోనే ఏర్పాట్లు చేసిన దృష్ట్యా ప్రజలు వైద్య
సేవలు వినియోగించుకోవాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్
డెలివరీల సంఖ్య గణనీయంగా పెరిగిందని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులలో స్టెమీ
కార్యక్రమం ద్వారా 40 వేల రూపాయల విలువ కలిగిన ఇంజక్షన్ ఇస్తూ గుండెపోటు
రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, అన్నీ జిల్లాలో స్టెమీ కార్యక్రమం
ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. న్యూట్రీషన్ కిట్స్ పంపిణీ; గర్భిణుల్లో
పోష్టికాహార లోపం, రక్తహీనత నివారించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్లను అందజేసయడం శుభ పరిణామం అన్నారు. ఇప్పటికే తొలి
విడతలో పలు జిల్లాల్లో గర్భిణులకు అందజేయగా రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా
గర్భిణులకు కిట్ల పంపిణీలో ఖమ్మం జిల్లాలో కూడా పంపిణీ చేస్తున్నామన్నారు.
ఇప్పటి వరకు అనేక ప్రభుత్వాలు 70 ఏళ్లు పలించగా నేటి వరకు కేవలం 3 కళాశాలలు
వస్తే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన 8 ఏళ్లలోనే ముఖ్యమంత్రి కేసీఅర్
నేతృత్వంలో 33 మెడికల్ కళాశాలలు తెచ్చుకున్నామన్నారు. నాటి పాలకులు వైద్య
రంగాన్ని అటకెక్కించగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న చొరవతో అనతి
కాలంలోనే సర్కారు వైద్య సేవలు అన్ని వర్గాలకు చేరువయ్యాయని, ఏ రోగం వచ్చినా
ఒకే సూది మందు, ఒకే మందు బిల్ల ఇచ్చిన చోటే నేడు తెలంగాణ ప్రభుత్వంలో
కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వం వైద్యం అందుతున్నదన్నారు. ఒకప్పుడు సర్కారు
వైద్యం అంటే చిన్న చూపు ఉండేదని, అప్పటి ప్రభుత్వాల వైఫల్యాలు, నిరాదరణ
కారణంగా ప్రైవేట్ వైద్య రంగం బలపడిందన్నారు. సర్కారు వైద్యం అంటేనే జనం
భయపడేవారని, ఏ చిన్న రోగమైనా నయం చేయించుకునేందుకు ప్రైవేట్ దవాఖానలనే
ఆశ్రయించే పరిస్థితుల నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ స్వీయ
పర్యవేక్షణలో పర్యవేక్షణలో ప్రభుత్వం వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి
పెట్టిందన్నారు. కేసీఅర్ ప్రభుత్వ వైద్యం బలోపేతం చేసే క్రమంలో అనేక మార్లు
విశ్లేషణ చేసి క్రమంగా అద్యననం చేస్తూ భారీగా నిధులు కేటాయించి నేడు పేదలకు,
సామాన్యులకు కార్పొరేట్ కు ధీటుగా పూర్తి స్థాయిలో ఉచిత వైద్యం
అందిస్తున్నామని పేర్కొన్నారు.
నేడు వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే సందర్భంగా మంత్రి పువ్వాడ రక్త దానం చేశారు.
అనంతరం జిల్లాలో పని చేస్తున్న ఉత్తమ వైద్యులు, సిబ్బందికి ప్రశంస పత్రాలు,
మెమెంటోలు బహుకరించి అభినందించారు. కార్యక్రమంలో విత్తనాభివృద్ది సంస్థ
చైర్మన్ కొండబవాల కోటేశ్వర రావు, మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్
ఫాతిమా, సుడా చైర్మన్ విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ గౌతమ్, మున్సిపల్ కమిషనర్
ఆదర్శ్ సురభి, మాలతీ, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వర రావు,
ఆసుపత్రి సూరింటెండెంట్ వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది
ఉన్నారు.