హైదరాబాద్ : తెలంగాణలోని నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు లభించాయి.
యాదాద్రి ఆలయం సహా 5 భవనాలకు ‘ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్
యాపిల్’ అవార్డులు దక్కించుకున్నాయి. లండన్‌కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ ఈ
అవార్డులను ప్రకటించింది. అవార్డులు పొందిన వాటిలో యాదాద్రి ఆలయం, దుర్గం
చెరువు కేబుల్ బ్రిడ్జి, తెలంగాణ సచివాలయం, పోలీసు కమాండ్ కంట్రోల్ రూం,
మొజాంజాహీ మార్కెట్ ఉన్నాయి. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ నిర్మాణాలకు
గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కడం విశేషం. లండన్‌లో ఈ నెల 16న గ్రీన్
ఆర్గనైజేషన్ అవార్డులను అందించనుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున పురపాలక శాఖ
ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ అవార్డులను అందుకోనున్నారు.