నందిగామ : ఏపీ ఎంసెట్ ఫలితాలలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన నందిగామ
పట్టణానికి చెందిన విద్యార్థి చల్లా ఉమేష్ వరుణ్ ను శాసనసభ్యులు డాక్టర్
మొండితోక జగన్ మోహన్ రావు ప్రత్యేకంగా అభినందించి, శాలువతో సత్కరించారు.
అనంతరం విద్యార్థి తల్లిదండ్రులు చల్లా విశ్వేశ్వరరావు, దేవకీదేవి దంపతులను
ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్
మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ నందిగామ పట్టణానికి చెందిన విద్యార్థి
ఏపీ ఎంసెట్ ఫలితాలలో స్టేట్ మొదటి ర్యాంకు సాధించడం హర్షణీయమని, ఇదే
విద్యార్థి గత నెలలో ప్రకటించిన తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో స్టేట్ 3 వ ర్యాంకు
సాధించడం కూడా జరిగిందని తెలిపారు. తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చేలా
విద్యార్థి చదువుల్లో రాణించటం అభినందనీయమన్నారు. చదువు పట్ల ఎంతో ఆసక్తి, ఏదో
సాధించాలనే తపన, శ్రమ, పట్టుదల ఉంటేనే ఇటువంటి ర్యాంకులు సాధించడం
సాధ్యమవుతుందన్నారు. విద్యార్థి ఉమేష్ వరుణ్ కు బంగారు భవిష్యత్తు ఉంటుందని,
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు
చెప్పారు. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వంటి సాధించిన ఉమేష్ వరణ్ ను స్ఫూర్తిగా
తీసుకొని విద్యార్థులందరూ కూడా చదువుల్లో రాణించాలని సూచించారు. ఈ
కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.