వాషింగ్టన్ : మౌలిక సదుపాయాల రంగంలో ఉన్న లోటును పూడ్చుకునేలా ప్రైవేటు రంగం
నుంచి భారత్‌కు పెట్టుబడుల్ని ఆకర్షించడంలో చురుకైన పాత్ర పోషించనున్నట్లు
అమెరికా తెలిపింది. నూతన సాంకేతికతల వ్యయాన్ని తగ్గించి, ప్రపంచ ఆర్థిక
రంగానికి చేయూతనివ్వడంలో ఇరుదేశాల ఆవిష్కరణలు దోహదపడాలని అమెరికా ఆర్థిక శాఖ
కార్యదర్శి జనెట్ యెలెన్ ఆకాంక్షించారు. అమెరికాకు విశ్వసనీయ వాణిజ్య
భాగస్వాముల్లో భారత్ ఒకటనీ, ప్రపంచ మార్కెట్‌కు కొత్త సమూహాలను అనుసంధానం
చేయడంపై రెండు దేశాలూ కృషి చేస్తున్నాయని చెప్పారు. అమెరికా-భారత్ వాణిజ్య
మండలి నిర్వహించిన వార్షిక సదస్సులో ఆమె ప్రసంగించారు. వాణిజ్యం, పెట్టుబడుల
రంగాల్లో చక్కని పురోగతి సాధించడానికి రెండు దేశాలకూ అవకాశాలున్నాయని
చెప్పారు. శుద్ధ ఇంధన సాంకేతికతల్లోనూ నాయకత్వం వహించేందుకు
ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను
ఇప్పటివరకు పదిసార్లు కలిశాననీ, భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యానికి తాము
ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది నిదర్శనమని చెప్పారు.

భాగస్వామ్యం బలోపేతం : రిచర్డ్ వర్మ
నరేంద్ర మోడీ పర్యటన ద్వారా రెండు దేశాల బంధాలను ‘సానుకూల వ్యూహాత్మక
పరిణామం’గా మార్చుకునేందుకు ఎదురు చూస్తున్నామని శ్వేతసౌధం పేర్కొంది. రాబోయే
రెండు దశాబ్దాలకు రెండు దేశాల బంధాలను సంస్థాగతం చేయడం ఈ పర్యటన ఉద్దేశమని
భారత సంతతి దౌత్యాధికారి రిచర్డ్ వర్మ పేర్కొన్నారు. అందుకే దీనికి బైడెన్
ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. రాబోయే రెండేళ్లలో ఇరు దేశాలు కలిసి
చేసే పని.. తర్వాతి 20 ఏళ్ల కాలానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు.
భాగస్వామ్యాన్ని బలపరచడంలో మోదీ పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు.