హైదరాబాద్ : విదేశాంగశాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ సికింద్రాబాద్‌లోని
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ‘బతుకమ్మ’
పత్రిక మూడో ఎడిషన్‌ను ఆవిష్కరించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన
కౌంటర్లను ప్రారంభించారు. గతేడాది 6.21 లక్షల దరఖాస్తులను మంజూరు చేసినందుకు
సిబ్బందిని అభినందించారు. ఐదు నెలల వ్యవధిలోనే 3.5 లక్షల పాస్‌పోర్ట్‌లు
మంజూరు చేశారని తెలుసుకొని ఇదే ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. ఏడాది
చివరికల్లా ఈ సంఖ్య 7 లక్షలు దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆఫీసు
వ్యర్థాలతో రూపొందించిన జీ20 ఆర్టిక్రాఫ్ట్ను చూసి సిబ్బంది కృషిని
అభినందించారు.