మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : విద్యకు తొలి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఈ
దేశంలోనే ప్రత్యేకంగా గుర్తింపు పొందారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్
అన్నారు. గురువారం నరసన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన నియోజకవర్గ
స్థాయి జగనన్న ఆణిముత్యాలు పురస్కార సభలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ
సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణతోనే విద్యకు సార్ధకత ఏర్పడుతుందని అన్నారు.
ముఖ్యమంత్రి జగన్ తన పిల్లలతో సమానంగా ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ విద్యారంగంలో
ఉత్తమ ప్రయోజనాలు అందాలని, ఆ దిశగా కృషిచేస్తున్నారని అన్నారు. విద్యారంగంలో
నాడు-నేడు, అమ్మఒడి, విద్యాదీవెన..ఇలా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు
అమలు చేస్తున్నారని అన్నారు. మన జిల్లా విద్యార్ధులు దేశంలో ఉత్తమ ప్రతిభతో
ఎంతో గుర్తింపు పొందుతున్నారని అన్నారు. అఖిల భారత స్థాయి నీట్ లో మన జిల్లా,
మన నరసన్నపేట నియోజకవర్గం, మన పోలాకి మండలానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తికి
మొదటి ర్యాంకు రావడం మనందరికీ గర్వకారణమన్నారు. అతనిని సన్మానించబోతున్నట్టు
చెప్పారు. క్రీదారంగంలో కూడా ఆమదాలవలసకు చెందిన కరణం మల్లీశ్వరి ఎంత స్థాయిలో
ఈ దేశానికి ఒక గుర్తింపుని తీసుకొచ్చారో అందరికీ తెలుసని అన్నారు.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుకుని 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్
పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ‘జగనన్న
ఆణిముత్యాలు’ పేరిట ప్రభుత్వం సత్కరిస్తోందని తెలిపారు. జెడ్పీ, ప్రభుత్వ,
మున్సిపల్, ఏపీ మోడల్, బీసీ రెసిడెన్షియల్, ఏపీ రెసిడెన్షియల్, సోషల్
వెల్ఫేర్ రెసిడెన్షియల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్, కేజీబీవీ
మేనేజ్మెంట్లలో విద్యాసంస్థలున్నాయన్నారు. ఒక్కో మేనేజ్మెంట్ పరిధిలోని
సంస్థల్లో పదోతరగతిలో మొదటి మూడుస్థానాల్లో నిలిచిన విద్యార్థులను
సన్మానిస్తారని తెలిపారు. ఇలా నియోజకవర్గస్థాయిలో మొదటి మూడుస్థానాల్లో
నిలిచిన పదో తరగతి విద్యార్థులు 678 మంది ఉన్నారన్నారు.ఇంటర్మీడియట్లో
మొదటిస్థానంలో నిలిచిన విద్యార్థులు 662 మంది ఉన్నారని తెలిపారు. విద్యలో
నాణ్యత, విద్యార్థుల్లో నైపుణ్యాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ వేడుక
నిర్వహిస్తోందని అన్నారు. ఈ పురస్కారారు మరింతమందికి ప్రేరణగా నిలవాలన్నదే
జగన్ సంకల్పమన్నారు. విద్యార్థులకు నగదు పురస్కారం, మెడల్, మెరిట్
సర్టిఫికెట్, పాఠశాలకు మెమెంటో ఇవ్వడంతోపాటు సంబంధిత పాఠశాల
ప్రధానోపాధ్యాయులను, విద్యార్థుల తల్లిదండ్రులను కూడా సత్కరిస్తున్నామన్నారు.
నియోజకవర్గస్థాయిలో పదో తరగతి విద్యార్థులకు మొదటి బహుమతిగా రూ.15 వేలు, రెండో
బహుమతిగా రూ.10 వేలు, మూడో బహుమతిగా రూ.5 వేలు చొప్పున నగదు బహుమతి
అందజేస్తున్నామన్నారు.రాష్ట్రస్థాయిలో జగనన్న ఆణిముత్యాలను ఈనెల 20న
విజయవాడలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సత్కరించనున్నారని తెలిపారు.
పదో తరగతిలో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.లక్ష, రెండోస్థానంలోని
వారికి రూ.75 వేలు, మూడోస్థానంలో నిలిచిన వారికి రూ.50 వేలు, ఇంటర్
టాపర్స్‌కు రూ.లక్ష చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారన్నారు. ఈ సందర్భంగా
విద్యార్ధులకు ఆణిముత్యాలు ప్రస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జలుమూరు
ఎంపిపి వాన గోపీ, పోలాకి ఎంపిపీ ప్రతినిధి ముద్దాడ భైరాగి నాయుడు, నరసన్నపేట
సర్పంచ్ బూరెళ్ల శంకరరావు, వైఎస్సార్సీపీ నాయకులు పాగోటి రామారావు, చింతు
రామారావు, వివిధ విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.