అవార్డులు
నంద్యాల : నంద్యాల నియోజకవర్గం లోని ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ లో ఈ సంవత్సరం
ఉన్నతమైన మర్క్స్ సాధించిన విద్యార్థులకు సత్కారాలు చేశారు. స్థానిక గర్ల్స్
హై స్కూల్ నందు నిర్వహించిన జగన్ అన్న ఆణిముత్యాలు-2023 కార్యక్రమంలో నంద్యాల
ఎం ఎల్ ఏ శిల్పా రవిరెడ్డి పాల్గొన్నారు. నంద్యాల నియోజకవర్గంల పదవ తరగతి
ఫలితాల్లో మొదటి ర్యాంక్ సాధించిన ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని చాకలి
రాజేశ్వరి కి ఆర్థిక బహుమతి 15,000, రెండవ ర్యాంక్ ప్రభుత్వ హై స్కూల్
విద్యార్థి ఎం.శేషు ఫణి కి 10,000, మూడవ ర్యాంక్ జెడ్ పీ హెచ్ ఎస్ దీబగుంట్ల
విద్యార్థి గోస ప్రణయ్ కుమార్ కి 5000 రూపాయలు అందజేశారు. అలాగే ఇంటర్
ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి కోడుమూరి పూజిత కు 15,000,
రెండవ ర్యాంక్ ప్రభుత్వ జూనియర్ కళాశాల క విద్యార్థిని మౌనిక కు 15,000, మూడవ
ర్యాంక్ పి ఎస్ సీ కేవీయేస్ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని షేక్ హుసేన
బీ కు 15,000 ఆర్థిక బహుమతిని ఎం ఎల్ ఏ శిల్పా రవి రెడ్డి, మున్సిపల్
ఛైర్మెన్ మాబునిస్స, డి ఈ ఓ సుధాకర్ రెడ్డి అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర
వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కోఆర్డినేటర్ పిపి మధుసూదన్ రెడ్డి, నంద్యాల
మున్సిపల్ చైర్పర్సన్ మాభూన్నిసా, దృశ్యకతల డైరెక్టర్ సునీత అమృత రాజ్ నంద్యాల
మండలం ఎంపీపీ శెట్టి ప్రభాకర్, డిఈవో సుధాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్
చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పంషావలి, వైసిపి కౌన్సిలర్లు ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.