‘స్కిల్ హబ్ ల’పై నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
సమీక్ష * ‘స్కిల్ ట్రైనింగ్ అకాడమీ’ పనుల పురోగతిపై చర్చ * ఆగస్ట్ 15 కల్లా
పూర్తికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిశానిర్దేశం * డోన్ మోడల్ లో ఐటీఐలతో
పరిశ్రమల అనుసంధాన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశం
విజయవాడ : ఐటీఐ, పాలిటెక్నిక్, స్కిల్ కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం
చేయాలని నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
వెల్లడించారు. ఇటీవల నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ప్రారంభమైన ‘కియా నాలెడ్జ్
ఎక్స్ లెన్స్ సెంటర్’తరహాలో ఆ అనుసంధానం జరగాలని మంత్రి ఆదేశించారు. గురువారం
విజయవాడ ఆటోనగర్ లోని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి బుగ్గన
రాజేంద్రనాథ్ నైపుణ్య శాఖపై సమీక్ష నిర్వహించారు. ఆగస్ట్ 15వ తేదీ కల్లా
‘ఇండస్ట్రియల్ కనెక్ట్’ ప్రక్రియ పూర్తి కావాలని ఆయన మార్గనిర్దేశం చేశారు.
సుమారు 200 సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో అక్కడ
స్థానికంగా గల అవకాశాలు, డిమాండ్ ఉన్న రంగాలకు పెద్దపీట వేయాలన్నారు.
స్కిల్ హబ్ లు, జాబ్ మేళాలపై ప్రత్యేక దృష్టి : స్కిల్ హబ్ లలో శిక్షణ కోసం
ఇప్పటివరకూ 15,559 మంది నమోదు చేసుకున్నట్లు నైపుణ్య శాఖ ముఖ్య కార్యదర్శి
సురేష్ కుమార్ మంత్రి బుగ్గనకు వివరించారు. ఎన్ని బ్యాచ్ లు, ఎంత మందికి
శిక్షణ పూర్తయి..ఉద్యోగాలు పొందారన్న వివరాలపై మంత్రి ఆరా తీశారు. అయితే
ఇప్పటికే 308 బ్యాచ్ లలోని 8,807 మందికి శిక్షణ పూర్తయిందని, ఇంకా 249 బ్యాచ్
లలోని 6,733 మంది శిక్షణ దశలో ఉన్నట్లు వెల్లడించారు. 6,713 మంది యువతకు
ధృవపత్రాలు అందజేశామన్నారు. మొత్తం 3,636 మందికి ఉపాధి అవకాశాలు అందించినట్లు
ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ కుమార్ మంత్రికి తెలిపారు. ప్లేస్ మెంట్లలో
పశ్చిమగోదావరి నూరుశాతం నమోదు చేసిందని, ఆ తర్వాత నంద్యాల జిల్లా 93 శాతంతో
రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఎన్టీఆర్, కర్నూలు,
అన్నమయ్య జిల్లాలున్నాయన్నారు. స్కిల్ కాలేజీలలో 1484 మంది ఎన్ రోల్
చేసుకోగా..శిక్షణ పూర్తి చేసుకుని 566 మంది ప్లేస్ అయినట్లు పీపీటీ ప్రజంటేషన్
ఇచ్చారు. 2023-24 ఏడాదికి గానూ 54 జాబ్ మేళాలు నిర్వహించగా మొత్తం 7,233
మందికి ఉద్యోగాలు దక్కాయని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు. స్కిల్
కాలేజ్, స్కిల్ హబ్ లకు సంబంధించి కొత్త విధానంలో బ్రాండింగ్ చేయాలని మంత్రి
బుగ్గన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పులివెందులలో పడా
(పులివెందుల అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ)లో ఏర్పాటు కానున్న నైపుణ్య శిక్షణ
అకాడమీ పనుల పురోగతిపైన మంత్రి బుగ్గన చర్చించారు. జూలై 8 కల్లా పూర్తి చేసే
విధంగా యుద్ధప్రాతిపదికన పనులు జరిగేలా చూడాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్య
కార్యదర్శి సురేష్ కుమార్, ఏపీఎస్ఎస్డీసీ ఎండీ వినోద్ కుమార్, ఉపాధి, శిక్షణ
శాఖ డైరెక్టర్ నవ్య, సీడ్యాప్ సీఈవో శ్రీనివాసులు, ఏపీఎస్ఎస్డీసీ
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు క్రాంతి, దినేశ్ తదితరులు పాల్గొన్నారు.