పాటు జరుగుతున్న తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు ప్రట్టణ ప్రగతి
దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం అధికార యాంత్రాంగం భారీ ఏర్పాట్లు
చేసింది. 2020లో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కారు
హైదరాబాద్ సహా అన్ని నగరాలూ, పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని
పేర్కొంది.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ పట్టణ ప్రగతి వేడుకలకు రాష్ట్ర
ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో
దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
హైదరబాద్ శిల్పకళా వేదికలో వైభవంగా వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో
రాష్ట్ర మున్సిపల్ పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహా పలువురు మంత్రులు,
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరవుతారు.
ఉత్తమ మున్సిపాలిటీ, కార్పొరేషన్ల వార్డు కౌన్సిలర్లను, చైర్మన్లను, మేయర్లను,
ఉద్యోగులను ఈ సందర్భంగా ప్రభుత్వం సత్కరించనుంది. ఆయా మున్సిపాలిటీలలో
చేపట్టిన అభివృద్ధి పనులు, కార్యక్రమాలు, పట్టణ పారిశుద్ధ్యం, పచ్చదనం
గణనీయంగా మెరుగుపడిన తీరును ప్రజలకు వివరించాలని సూచించింది. జాతీయ స్థాయిలో
పట్టణ అభివృద్ధిలో సాధించిన విజయాలు, అవార్డుల వివరాలను కూడా ఈ ఉత్సవాల్లో
ప్రదర్శించనున్నారు.
పట్టణప్రగతి నిధుల వినియోగానికి సంబంధించి ప్రకటన విడుదల.. ఇప్పటివరకు
ఎంతంటే..?
పట్టణీకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో నిలిచిందని సర్కారు
ప్రకటించింది. దేశ జనాభాలో 35.1 శాతం పట్టణాల్లో నివసిస్తుండగా రాష్ట్రంలో
ఏకంగా 47.6 శాతం జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారని తెలిపింది. 2020లో పట్టణ
ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సర్కారు హైదరాబాద్ సహా అన్ని నగరాలూ,
పట్టణాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందని పేర్కొంది.