విజయవాడ : రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు అదుపులో
ఉన్నాయని, విశాఖ లో భూ కబ్జాలు లేవని డీజీపీ చెబుతుంటే నవ్వాలో, ఏడవలో అర్ధం
కాని పరిస్థితి ఉందని వ్యాఖ్యలు చేశారు. శనివారం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ
సాక్షాత్తు ఎంపీ, కుమారుడు, సీఎంకు దగ్గరి వ్యక్తిగా ఉన్న ఆడిటర్ను కిడ్నాప్
చేశారన్నారు. అనంతపురంలో ఆత్మహత్య, ఏలూరులో యాసిడ్ దాడి, చెంచునాడులో దళితులపై
దాడులు జరిగాయని తెలిపారు. అయినా రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని
చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి,
ప్రతిపక్షాలను నిర్బంధం చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నడూ లేని
విధంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షిణించాయన్నారు. హోంమంత్రి కేవలం నామాకే
వాస్తి ఉన్నారని వ్యాఖ్యానించారు. హోం శాఖను చూస్తున్నది అంతా కడప వ్యక్తులే
అని చెప్పుకొచ్చారు. సీఎం, డీజీపీ, రాష్ట్ర సలహాదారు ఇలా అంత కడప వ్యక్తులే
అని తెలిపారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యమేలుతోందని రామకృష్ణ వ్యాఖ్యానించారు.