కాకినాడ : వైఎస్సార్సీపీ హయాంలోనే మహిళలకు అధిక ప్రాధాన్యత దక్కిందని కాపు
మహిళా నేతలు అన్నారు. ఆదివారం వారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాకినాడలో
కాపు మహిళలను ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి రాజకీయంగా
ప్రోత్సహిస్తున్నారన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాల కోసం తప్పుడు ఆరోపణలు
చేస్తున్నారని మండిపడ్డారు. వీర మహిళలపై దాడి అంటూ రెచ్చగొట్టేయత్నం
చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యే ద్వారంపూడిపై వపన్ చేసేవన్నీ తప్పుడు
ఆరోపణలేనని కాపు మహిళా నేతలు అన్నారు. కాపులను గౌరవించేది ఎమ్మెల్యే
ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. కాపుల కోసం ఆలోచించి ఉన్నత పదవులు ఇచ్చారని నగర
వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు సుంకర శివ ప్రసన్న పేర్కొన్నారు. పవన్ ఎక్కడ
మీటింగ్ పెట్టిన ద్వారంపూడి పేరు ప్రస్తావిస్తున్నారు. ద్వారంపూడి వల్ల
పవన్‌కు ఎప్పుడో మంచి జరిగే ఉంటుంది. గతంలో ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని
ముట్టడించడానికి వీరమహిళలు వచ్చారు. అప్పుడు మేమంతా ద్వారంపూడికి అండగా
నిలబడ్డాం అని కాకినాడ అర్బన్ డవలప్మెంట్ ఛైర్మన్ చంద్రకళా దీప్తి అన్నారు.
గత 30 ఏళ్లుగా నగరంలో ఉన్న 80 శాతం కాపులు ద్వారంపూడి కి అండగా ఉంటున్నాం.
మాకు ద్వారంపూడితో ప్రయాణం ఆనందకరం అని కాపు నేత రాజారపు కృష్ణ పేర్కొన్నారు.