టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
అమరావతి : ఏపీలో పోలీసుల తీరు దారుణంగా ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
కింజరాపు అచ్చెన్నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు వైసీపీకి
తొత్తులుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. చట్టాన్ని ఉల్లంఘించి ప్రజలను
వేధిస్తున్నారని దుయ్యబట్టారు. న్యాయం కోరినందుకు రాజమండ్రి బొమ్మూరు
స్టేషన్లో రియల్ ఎస్టేట్ వ్యాపారిని పోలీసులు కొట్టడం దారుణమన్నారు. సోషల్
మీడియాలో పోస్టులు పెట్టాడని, టీడీపీ కార్యకర్త చంద్రబాబును అక్రమంగా అరెస్ట్
చేశారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో అభిప్రాయాలు పంచుకొనేందుకు స్వేచ్ఛ లేదా?
అని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్త చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని
అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.