వాషింగ్టన్ : అమెరికా రాజధాని వాషింగ్టన్లో ఈ నెల 23వ తేదీన ప్రధాన మంత్రి
నరేంద్ర మోడీ పాల్గొనే ప్రవాస భారతీయ సమ్మేళనంలో ఆఫ్రికన్ అమెరికన్
గాయకురాలు, నటి మిల్బెన్ ప్రదర్శన ఇవ్వనున్నారు. ఇప్పటికే ఆమె ‘ఓం జయ
జగదీశ్ హరే, జనగణమన’ గీతాలను ఆలపించి ప్రాచుర్యం పొందారు. 21న ఐక్యరాజ్య
సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే యోగా దినోత్సవంలోనూ ఆమె పాల్గొంటారు. ప్రవాస
భారతీయులే పాల్గొనే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందినట్లు
ఆదివారం మిల్బెన్ వెల్లడించారు. అమెరికాలో భారత ప్రధాని మోదీ పర్యటన కోసం
అత్యంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఈ పర్యటన భారత్, అమెరికా సంబంధాల్లో
పండగలాంటిది. రెండు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య బలమైన బంధం ప్రస్తుత
ప్రపంచంలో ఎంతో ముఖ్యమైందని ఆమె వ్యాఖ్యానించారు.