విజయవాడ : పూర్తి పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు పూర్తి చేశామని ఆంధ్రప్రదేశ్
విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో
సమావేశమయ్యాం. వారి సహకారంతో విద్యా వ్యవస్ధని మరింత పటిష్టం చేస్తామని
చెప్పారు. 1.75 లక్షల మంది ఉఫాద్యాయులలో 82 వేల మంది బదిలీకి ధరఖాస్తు
చేసుకున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో 52 వేల మందికి పైగా ఉపాధ్యాయులు బదిలీ
అయ్యారని తెలిపారు. సీనియర్ హెడ్ మాస్టర్లని సెకండ్ ఎంఇఓలగా నియమించామని,
కొత్తగా 679 మంది సెకండ్ ఎంఇఓ పోస్టులని భర్తీ చేశామన్నారు. రాష్ట్ర
వ్యాప్తంగా 355 ఎంఇఓ వన్ పోస్టులు ఖాళీలు ఉండగా వీటిని కూడా సీనియర్ హెడ్
మాస్టర్లతో భర్తీ చేస్తామన్నారు. వడగాల్పులు తీవ్రత దృష్ట్యా, సీఎం
ఆదేశాలమేరకు మరో వారం రోజులు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్లు తెలిపారు. మూడవ
తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ప్రాధమిక స్ధాయి నుంచే నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రణాళికలు
రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 ఇంజనీరింగ్
ప్రొఫెసర్ల ద్వారా ఉపాధ్యాయులకి డిజిటల్ విద్యా బోధనపై శిక్షణ ఇవ్వనున్నట్లు
తెలిపారు. ప్రైమరీ స్ధాయిలో పదివేల స్మార్ట్ టివీలు ఏర్పాటు చేయనున్నట్లు
తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సింగిల్ టీచర్లు ఉన్న పాఠశాలలు 9 వేలు ఉండగా..
సింగిల్ టీచర్ సెలవుపెట్టే పాఠశాలలకి అందుబాటులో ఉండేలా మండలానికి నలుగైదురు
టీచర్లని ఏర్పాటు చేస్తున్నామన్నారు.