విజయవాడ : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, మాజీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ
జన్మదిన వేడుకలను విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ లో నిర్వహించారు. ముఖ్య
అతిథిగా విచ్చేసిన ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు భారీ కేకును కట్ చేసి
రాహుల్ గాంధీ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో
మాట్లాడుతూ రాహుల్ శకం రాబోతుందని, కాంగ్రెస్ పార్టీ అత్యంత భారీ మెజార్టీతో
కేంద్రంలో అధికారాన్ని చేపట్టబోతుందని ఆయన స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్
గాలి వీస్తుందని, ఇక కాంగ్రెస్ ప్రభంజనమేనని ఆయన అన్నారు.అనంతరం కాంగ్రెస్
పార్టీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని
పూజ కార్యక్రమాలు నిర్వహించి లాంచనంగా ప్రారంభించారు. అదే ప్రచార రథంలో
రుద్రరాజు ప్రయాణించి పాత ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ
కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నింటిలోనూ ఆయనతోపాటు వర్కింగ్
ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు నరహరశెట్టి నరసింహారావు, వి
గురునాథం, డాక్టర్ జంధ్యాల శాస్త్రి, పి వై కిరణ్, మేడ సురేష్, దనేకుల మురళి,
పి నాంచారయ్య, గొల్లు కృష్ణ, మీసాల రాజేశ్వరరావు, పి సతీష్, బైపూడి
నాగేశ్వరరావు, గౌస్, బేగ్, ఖుర్షీదా, మహిళా నాయకులు, కార్యకర్తలతో, బాణసంచా
శబ్దాలతో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు విజయవంతంగా ముగిశాయి.