‘విక్రమ్’ చిత్రంతో గతేడాది బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కమల్ హాసన్
ప్రస్తుతం ‘ఇండియన్ 2’ సినిమాలో నటిస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో
రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వాస్తవానికి నాలుగేళ్ల
క్రితమే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టినా.. సెట్ లో క్రేన్ యాక్సిడెంట్, టీమ్
మధ్య వచ్చిన విభేదాల కారణంగా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది. ఆ సమస్యలన్నింటినీ
పరిష్కరించుకున్న మేకర్స్ లాస్ట్ ఇయర్ తిరిగి షూటింగ్ ను మొదలుపెట్టారు.
అప్పట్నుంచీ వరుస షెడ్యూల్స్ తో ఏపీ, తెలంగాణతో పాటు తైవాన్, ఆఫ్రికాలోనూ
కొన్ని సీన్లు షూట్ చేశారు. ఆగస్టుకి మొత్తం షూటింగ్ ను పూర్తి చేయనున్నారు.
ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. అనుకున్న దానికంటే ముందే
షూటింగ్ పూర్తవడంతో టీమ్ అంతా హ్యాపీ ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. దీంతో
సంక్రాంతికే సినిమా రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే రామ్ చరణ్
శంకర్ తీస్తున్న ‘గేమ్ ఛేంజర్’ను సంక్రాంతికే విడుదల చేస్తామన్నారు. దీంతో
రెండింటిలో ఏది సంక్రాంతికి వస్తుందో అనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఇక
‘ఇండియన్ 2’లో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీతి సింగ్, ప్రియా భవానీశంకర్
హీరోయిన్లుగా నటిస్తున్నారు. సిద్ధార్థ్, ఎస్.జె.సూర్య, బాబీ సింహా, మనోబాల,
వెన్నెల కిశోర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్
సుభాస్కరణ్ కలిసి ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్నారు.