దుర్మార్గం
2019 నుండి కాపు ఉద్యమాన్ని అందుకే అటకెక్కించారు
కాపు సంఘం ముసుగులో ఉంటూ జగన్, వైసీపీ కోసం, ద్వారంపూడి కోసం పని చేశారు
కాపు సంక్షేమం కోసం వైసిపి ప్రభుత్వానికి ఒక్క లేఖ అయినా రాసారా?
వైసిపి నాయకులు అన్ని వర్గాల ప్రజల్ని బూతులు తిడుతుంటే ముద్రగడ ఎందుకు
మాట్లాడలేదు
అన్ని వర్గాల ప్రజలు చట్టసభల్లోకి అడుగు పెట్టాలన్నది మా నాయకుడు పవన్ కళ్యాణ్
లక్ష్యం
అంబేద్కర్ భావజాలం ఉన్న పవన్ కళ్యాణ్ ని తిడితే సహించం
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్
విజయవాడ : ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కి రాసిన లేఖకు జనసేన పార్టీ
రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ స్పందించారు. ముద్రగడ పద్మనాభం
ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక రౌడీ, గుండా, అవినీతిపరున్ని
వెనకేసుకొస్తూ పవన్ కళ్యాణ్ కి లేఖ విడుదల చేయడం చాలా దుర్మార్గమని అన్నారు.
ఇటువంటి దుర్మార్గుడుకి, మీరు వత్తాసు పలికి ప్రజల మనిషి ప్రజల సమస్యల మీద
పోరాటం చేసేటువంటి పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారం మాటలు మాట్లాడి లేఖ మీరు
విడుదల చేశారంటేనే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వైసీపీతో మీరు చేతులు
కలిపారని స్పష్టంగా అర్థమవుతుందని, మీరు 2019 నుండి కాపు ఉద్యమాన్ని ఎందుకు
అటక ఎక్కించారని అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మీరు కాపు ఉద్యమం చేయరా
అని అన్నారు. కాపులకు కేంద్రం ఇచ్చినటువంటి ఏ, బి, సి రిజర్వేషన్ గురించి
గానీ, కాపు సంక్షేమానికి కేటాయించిన పదివేల కోట్లు నిధులు గురించి కానీ మీరు
జగన్మోహన్ రెడ్డి ని ప్రశ్నిస్తూ ఏనాడైనా ఒక్క లేఖ ఐనా రాశారా అని
ప్రశ్నించార. కానీ పవన్ కళ్యాణ్ గురించి మీరు లేఖ రాశారంటే మీరు ముమ్మాటికి
కాపుల ద్రోహి అని విమర్శించారు.
మీరు కాకినాడలో జనసేన నాయకులు మీద వీర మహిళ మీద దాడులు చేసినప్పుడు ఎందుకు
అప్పుడు ఆ దాడులను ఖండిస్తూ లేఖ విడుదల చేయలేదని, ఆరోజు మీరు మౌనంగా
ఉండడానికి గల కారణం ఏంటని దీనికి మీరు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా వైసీపీ నాయకులు నాలుగేళ్లుగా ఈ రాష్ట్రంలో ఇష్టానుసారం బూతు భాష
మాట్లాడుతుంటే, అన్ని వర్గాల ప్రజల్ని కించపరుస్తూ చాలా హీనంగా మాట్లాడుతుంటే
మీరు ఎందుకు మౌనంగా ఉన్నారని దీనికి మీరు సమాధానం చెప్పాలని కోరార. పవన్
కళ్యాణ్ ప్రజాస్వామ్య బద్దంగా కాకినాడలో ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని
ఓడిస్తాం అని చెప్తే మీకెందుకు అంత బాధ అని, మీరు ఏమి ఆశించి ద్వారపూడి
చంద్రశేఖర్ రెడ్డిని వెనకేసుకొచ్చారని, కాపు ఉద్యమానికి ఆయన లారీలు సప్లై
చేశారని, పోస్టర్లకి డబ్బులు ఇచ్చారని అంటే కాపు ఉద్యమాన్ని ద్వారంపూడి
చంద్రశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డికి వైసీపీ ప్రభుత్వానికి తాకట్టు
పెట్టావా?. దీనికి మీరు సమాధానం చెప్పాలన్నారు. పదేపదే మీరు కాపుల అభివృద్ధి,
సంక్షేమం, కాపులకి రాజ్యాధికారం అని మాట్లాడే మీరు సాటి సామాజిక వర్గానికి
చెందినటువంటి పవన్ కళ్యాణ్ గురించి సాటి కులస్తుడని ఒక్కసారైనా ఆయన గురించి
మంచిగా మాట్లాడారా అని, అదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి, జగన్మోహన్
రెడ్డికి అయితే మాత్రం మద్దతిస్తారా అంటే మీరు కాపు ఉద్యమ నేత అనే ముసుగులో
వైసిపికి ఇతర సామాజిక వర్గాలకి మద్దతు ఇచ్చే వ్యక్తి అని చాలా స్పష్టంగా
అర్థమవుతుందని మీ తీరు మార్చుకోవాలని కాపు ఉద్యమాన్ని ఎందుకు అటకేకించారో ఈ
రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సమాజ వర్గానికి చెందిన ప్రతి ఒక్కరికి కూడా మీరు
సమాధానం చెప్పాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని అన్ని సామాజిక
వర్గాలకు బాగుండాలని అనునిత్యం పోరాడే వ్యక్తి అని మాలాంటి బిసి సమాజ
వర్గానికి చెందినటువంటి వ్యక్తులు కూడా అధికారంలోకి రావాలని మమ్మల్ని శాసనసభకు
పంపాలని మా సామాజిక వర్గానికి గౌరవ మర్యాదలు అందాలని పదేపదే పరితపించే
అంబేద్కర్ భావాలు కలిగినటువంటి పవన్ కళ్యాణ్ ని తూలనాడితే రాష్ట్రంలో ఏ ఒక్కరు
కూడా మీకు కాపు కాయరని, అండగా నిలబడరని , మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని
డిమాండ్ చేశారు.