హైదరాబాద్ : సహజ యోగా ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందని, తద్వారా
ఉద్యోగులు చేసే పనికి, తమ విధులు, బాధ్యతలకు సార్థకత చేకూరుతుందని సహజయోగా
ధ్యానయోగిని గీత తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) నిర్వహించిన
కార్యాలయంలో సహజయోగిని గీత తన సహచరులతో సహజయోగ పద్ధతిని వివరించారు. ఈ
సందర్భంగా ఉద్యోగులు, సిబ్బందికి మానసిక ఒత్తిడిని అధిగమించడానికి సహజయోగ ఎంతో
ఉపకరిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా హెచ్ఎండిఏ సెక్రెటరీ పి.చంద్రయ్య ఓఎస్డి ఎం.రాంకిషన్ మాట్లాడుతూ
హెచ్ఎండిఏ ఉద్యోగులు ఇంట, బయట బాధ్యతలు నిర్వహించడంలో ఎన్నో మానసిక ఒత్తిళ్లకు
లోనవ్వడం సహజమని వాటి నుంచి ఉపశమనం పొందడానికి యోగ ఎంతో అవసరమని వివరించారు.