విజయవాడ : సి.ఆర్. మీడియా అకాడమీ ఆధ్వర్యంలో గురువారం “విద్య ఉపాధి అవకాశాలు –
ఆంగ్ల మాధ్యమం ఆవశ్యకత” అంశం పై సదస్సు నిర్వహించనున్నట్లు చైర్మన్ కొమ్మినేని
శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక మొఘల్ రాజపురం లోని సి.ఆర్.
మీడియా అకాడమీ కార్యాలయంలో ఈ సదస్సును ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ఆయన
తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత, కాలమిస్ట్ వెంకట్ పూల బాల రచించిన
‘ఆంగ్ల పద్య సంపుటి’ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.
సదస్సుకు సి.ఆర్. మీడియా అకాడమీచైర్మన్ హోదాలో తాము అధ్యక్షత వహించనున్నట్లు
ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నవరత్నాలు ప్రోగ్రామ్ ఎక్సిక్యూటివ్ వైస్
చైర్మన్ ఎ. ఎస్. నారాయణ మూర్తి, ఏ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రసిడెంట్ వి.వి.
ఆర్. కృష్ణం రాజు, నాగార్జున యూనివర్సిటీ యూనివర్సిటీ గెస్ట్ ఫాకల్టీ ఎస్.ఏ.
రెహమాన్, సి.ఆర్. మీడియా అకాడమీ సెక్రటరీ మామిడిపల్లి బాల గంగాధర్ తిలక్,
జర్నలిస్టులు పాల్గొంటారని ఆ ప్రకటనలో ఆయన తెలిపారు.