వైట్‌హాస్‌లో అధికారిక విందుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ
ప్రధానికి అమెరికా అధ్యక్షుడు బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఘన స్వాగతం
విందుకు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ సహా పలువురు భారత ప్రముఖుల హాజరు
వైట్‌హౌస్‌లో దక్షిణాన ఉన్న లాన్లో విందు ఏర్పాటు
ఆహుతుల కోసం విభిన్నమైన శాకాహార వంటకాలను సిద్ధం చేసిన శ్వేతసౌధం
చిరుధాన్యాల వంటకాలూ సిద్ధం
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఏర్పాటు చేసిన అధికారిక
విందుకు భారత ప్రధాని మోదీ హాజరయ్యారు. ప్రధానితో పాటూ ఇతర భారతీయ ప్రముఖులతో
కలిపి మొత్తం 400 మంది అతిథులు ఈ విందులో పాలుపంచుకున్నారు. బిలియనీర్ ముఖశ్
అంబానీ, ఆనంద్ మహీంద్రా, యాపిల్ సీఈఓ టిమ్ కుక్, కార్పొరేట్ దిగ్గజం
ఇంద్రానూయి, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్,
అడోబీ సీఈఓ శంతను నారాయణ తదితరులు ఈ విందుకు హాజరయ్యారు. శ్వేతసౌధంలో దక్షిణాన
ఉన్న లాన్లో ఈ విందు జరిగింది. ప్రధాని కోసం విభిన్నమైన శాకాహార వంటకాలను
వైట్‌హౌస్ సిద్ధం చేసింది. చిరు ధాన్యాలకు ప్రపంచవ్యాప్త ప్రచారం తెచ్చేందుకు
నరేంద్ర మోడీ కృషి చేస్తున్న నేపథ్యంలో విందు మెనూలో చిరుధాన్యాల వంటకాలనూ
చేర్చారు.