వాషింగ్టన్ : అగ్రరాజ్య పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శ్వేతసౌధంలో
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలిశారు. ద్వైపాక్షిక చర్చలకు ముందు ఇరువురు
మీడియాతో మాట్లాడారు. భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన నరేంద్ర మోడీ
తొలిసారి వారి కోసం శ్వేతసౌధ ద్వారాలు తెరచుకున్నాయని చెప్పారు. భారత్-
అమెరికా మధ్య భాగస్వామ్యం 21 శతాబ్దంలో నిర్ణయాత్మక సంబంధంగా నిలుస్తుందని
అగ్రరాజ్య అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ
కి ఆతిథ్యం ఇవ్వడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. మోదీ సహకారంతో క్వాడ్‌ను
బలోపేతం చేశామని గుర్తు చేసుకున్నారు. స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్‌కు క్వాడ్
కీలకమని చెప్పారు. మోడీ తో ద్వైపాక్షిక చర్చలు జరిపే ముందు మాట్లాడిన ఆయన..
ప్రపంచ శ్రేయస్సు కోసం క్వాడ్ పనిచేసిందనే విషయాన్ని భవిష్యత్ తరాలు
గుర్తిస్తాయని అన్నారు. పేదరిక నిర్మూలన విషయంలో భారత్, అమెరికా కలిసి
పనిచేస్తున్నాయని బైడెన్ పేర్కొన్నారు. వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి
తేవడం, వాతావరణ మార్పులపై పోరాడటం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ద్వారా తలెత్తిన
ఆహార, ఇంధన అభద్రతను తొలగించడం వంటి అంశాల్లో ఇరుదేశాలు కలిసి
పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు తీసుకునే నిర్ణయాలు రాబోయే తరాల భవిష్యత్‌ను
నిర్ణయిస్తాయని అన్నారు.
బైడెన్ ఆహ్వానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్
అనంతర యుగంలో ప్రపంచం కొత్తరూపు సంతరించుకుంటోందని మోడీ పేర్కొన్నారు.
ప్రపంచాన్ని బలోపేతం చేయడంలో భారత్-అమెరికా మధ్య స్నేహం కీలకంగా మారుతుందని
ఉద్ఘాటించారు. ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు కోసం భారత్-అమెరికాలు కలిసి
పని చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భారతీయ
అమెరికన్ల కోసం తొలిసారి శ్వేతసౌధం ద్వారాలు తెరచుకున్నాయని అన్నారు