షూటింగ్ చేసిన ప్రతి రోజూ కాస్ట్యూమ్స్ ధరించడానికి, మేకప్ వేసుకోవడానికి
నాలుగైదు గంటలు పట్టే క్యారెక్టర్ చేయడం చిన్న విషయం కాదు. మేకప్
పూర్తయ్యేంతవరకూ కదలకుండా కూర్చోవడం అనేది పెద్ద చాలెంజ్” అన్నారు మాళవికా
మోహనన్. విక్రమ్ హీరోగా పా. రంజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం
‘తంగలాన్’ లో మాళవికా మోహనన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తోంది. కోలార్ గోల్డ్
ఫీల్డ్ నేపధ్యంలో పీరియాడికల్ ఫిల్మ్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమ్ ఓ
గిరిజన తెగ నాయకుడి పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. మాళవికా మోహనన్ కూడా
అదే తెగకు చెందిన యువతిగా నటిస్తున్నారని తెలుస్తోంది. ఈ పాత్రకు సంబంధించిన
మేకప్ కి నాలుగైదు గంటలు పడుతోంది. “ఇలాంటి పాత్రలు చేసే అవకాశం అరుదుగా
వస్తుంది కాబట్టి ఇష్టంగా చేస్తున్నాను” అన్నారు మాళవికా మోహనన్.