మచిలీపట్నం : జగనన్న సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్
రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో లాంఛనంగా
ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా
కలెక్టర్ పి. రాజాబాబు జాయింట్ కలెక్టర్, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ
సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిపాలనలో విప్లవాత్మకమైన సంస్కరణలకు ప్రభుత్వం
శ్రీకారం చుట్టిందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి 2019లో ప్రభుత్వం
స్పందన కార్యక్రమం ప్రవేశపెట్టిందని అన్నారు. స్పందనలో పరిష్కారం కానీ సమస్యలు
నేరుగా ముఖ్యమంత్రి ద్వారా పరిష్కరించేందుకు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని
ప్రభుత్వం తీసుకువచ్చిందనీ అన్నారు. ఇంకా ఎవరైనా లబ్ధిదారులు పథకాలు పొందలేక
మిగిలిపోయి ఉంటే అట్టి వారిని గుర్తించి వారి సమస్యలు పరిష్కరించి ప్రభుత్వ
పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి జగనన్న సురక్ష కార్యక్రమం లాంఛనంగా
ప్రారంభించారన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమం నెలరోజుల
పాటు నిర్వహించనున్నారని అన్నారు. జిల్లాలో ప్రతి గ్రామ /వార్డు సచివాలయ
పరిధిలో వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కూడిన బృందం నేటి
నుండి ప్రతి ఇంటిని సందర్శిస్తారనీ అన్నారు. అర్హులై ఉండి ఎవరైనా లబ్ధి అందని
వారు ఉంటే గుర్తించి సమస్య పరిష్కారానికి కావలసిన పత్రాలను సేకరిస్తారని,
ధ్రువీకరణ పత్రాలు అవసరమైతే వాటిని పొందుటకు ప్రతి సచివాలయ పరిధిలో
నిర్ణయించిన తేదీ నాడు జగనన్న సురక్ష శిబిరం ఏర్పాటు చేస్తారనీ, ఈ శిబిరంలో
సంక్షేమ పథకాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరిస్తారని, అవసరమైన
ధ్రువపత్రాలు జారీ చేస్తారని అన్నారు. ఈ విధంగా 11 రకాలైన సేవలకు ఎలాంటి సేవా
రుసుం లేకుండా ఉచితంగా అందజేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్
డాక్టర్ అపరాజిత సింగ్, డి ఆర్ ఓ ఎం వెంకటేశ్వర్లు, ముడ చైర్పర్సన్ బి. నాగ
లక్ష్మి దుర్గ భవాని, ఆర్టీసీ జోనల్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, కే ఆర్
ఆర్ సి డిప్యూటీ కలెక్టర్ బి శివ నారాయణ రెడ్డి, జడ్పీ సీఈవో జ్యోతి బసు, డి
ఎల్ డి వో సుబ్బారావు, జిల్లా బీసీ సంక్షేమ అధికారి ఏ శ్రీనివాసరావు, వార్డు
సచివాలయాల సిబ్బంది పాల్గొన్నారు.