మచిలీపట్నం : రహదారుల భద్రతను అత్యంత ప్రాధాన్యతగా భావించి జిల్లాలో రోడ్డు
ప్రమాదాలను నివారించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో ఆయన రోడ్డు భద్రత కమిటీ సభ్యులతో
సమావేశం నిర్వహించి జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై
సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రవాణా, పోలీసు, ఆర్టీసీ,
జాతీయ రహదారులు, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయం చేసుకుంటూ రోడ్డు ప్రమాదాల
నివారణకు కృషి చేయాలని సూచించారు. రిపోర్టుల ప్రకారం ద్విచక్ర వాహనాలలో అధిక
ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులోనూ యువత మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతూ
విలువైన తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రమాదాల నివారణకు
రవాణా, పోలీసు అధికారులు నిత్యం డ్రంక్ అండ్ డ్రైవ్ లు నిర్వహిస్తూ డ్రైవింగ్
లైసెన్సులను రద్దు చేయాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారిపై కేసులను
నమోదు చేయాలని సూచించారు. తరచుగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి
ఆ ప్రాంతాలలోని ప్రమాదాలకు గల కారణాలను విశ్లేషించి తదుపరి ప్రమాదాలు జరగకుండా
అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన
కార్యక్రమాలు నిర్వహించాలని, ముఖ్యంగా యువతకు, ఆటో డ్రైవర్లకు జీవితం విలువ
తెలియ చెప్పాలని సూచించారు. వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడు అంతా సవ్యంగా ముందుకు
వెళుతుందని, వాహన చోదకులు ట్రాఫిక్ రూల్స్ పాటించేలా కఠినంగా వ్యవహరించాల్సిన
అవసరం ఉందని చెప్పారు. ఆర్టీసీ డ్రైవర్లకు నిత్యం బ్రీత్ అనలైజర్ లతో ఆల్కహాల్
పరీక్షలు నిర్వహించాలన్నారు. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి వెంబడి గ్రామాల
పరిధిలోని ప్రజలు ప్రమాదాలకు గురికాకుండా ఉండటానికి ఆయా ప్రాంతాల రహదారి పక్కన
ఐరన్ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని జాతీయ రహదారుల అధికారులకు సూచించారు.
మచిలీపట్నంలోని ప్రధాన రహదారులపై పశువులు నిత్యం సంచరిస్తున్నాయని, వాటి
యజమానులను హెచ్చరించిన అనంతరం అశ్రద్ధ చేసే వారికి జరిమానాలు విధించాలని
కమిషనర్ ను ఆదేశించారు. స్కూల్ బస్సుల ఫిట్నెస్ పై కలెక్టర్ రవాణా అధికారులను
ఆరా తీయగా జిల్లాలో 695 స్కూలు బస్సులకు గానూ 592 బస్సులకు ఫిట్నెస్ సరిగా
ఉందని, 100 బస్సులు మరమ్మతులు చేసుకోవలసి ఉందని వివరించారు. మూడు బస్సులు అన్
ఫిట్ గా తేలినట్లు కలెక్టర్ కు జిల్లా రవాణా అధికారి తెలిపారు. ఈ సమావేశంలో
అడిషనల్ ఎస్పీ ఆర్.శ్రీహరి బాబు, జిల్లా రవాణా అధికారి సీతాపతి, మచిలీపట్నం
నగరపాలక సంస్థ కమిషనర్ చంద్రయ్య, జిల్లా ప్రజా రవాణా అధికారిణి ఏ.వాణిశ్రీ,
డిపిఓ నాగేశ్వర నాయక్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల అధికారులు పాల్గొన్నారు.