సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన శుక్రవారం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి
నుంచి డిశ్చార్జి అయ్యారు. ఆమె ఈనెల 20న ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం అందరికి
తెలిసిందే. తండ్రి అయిన తరువాత తొలిసారి రామ్ చరణ్ మీడియాతో తన ఆనందాన్ని
పంచుకున్నారు. ‘ఏ తండ్రికైనా తన బిడ్డను తొలిసారి తాకగానే ఎలాంటి అనుభూతి,
ఆనందం కలుగుతాయో నాకు అలాగే ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల సాకారం
అయ్యింది. ఓ తండ్రికి ఇంతకన్నా ఆనందం ఏముం టుంది. ఈ సంతోషంలో మాటలు రావడం
లేదు. ఉపాసన, పాపను అపోలో వైద్యులు బాగా చూసుకున్నారు. వారికి ధన్యవాదాలు.
ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. వాళ్లు ఆరోగ్యంగా ఉండాలని పూజలు చేసిన అభిమానులకు
కృతజ్ఞతలు. మీ ఆశీస్సులు ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. నాన్న చిరంజీవి
చాలా సంతోషంగా ఉన్నారు. బాబు పాప ఎవరు పుట్టినా ఏ పేరు పెట్టాలనే విషయమై నేనూ
ఉపాసన ముందే మాట్లాడుకున్నాం. అదేంటో ఇప్పుడే చెప్పలేను. పేరు పెట్టే రోజున
నేనే స్వయంగా మీతో పంచుకుంటా’ అని పేర్కొన్నారు.